• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'SR క‌ళ్యాణమండంపం EST...

'SR క‌ళ్యాణమండంపం EST 1975' నుంచి 'సిగ్గేందుకురా మావ' సాంగ్..!

By - Tupaki Desk
Update: 2021-06-22 05:40 GMT
రాజావారు రాణిగారు' ఫేమ్ కిర‌ణ్ అబ్బ‌వ‌రం - 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ''SR క‌ళ్యాణమండ‌పం EST.1975''. శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్ర‌మోద్ - రాజులు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. అలానే 'చూసాలే క‌ళ్లారా' 'చుక్కల చున్నీనే' సాంగ్స్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుని మిలియన్ల కొద్దీ వ్యూస్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో 'SR క‌ళ్యాణమండంపం EST 1975' చిత్రం ఆడియో ఆల్బ‌మ్ నుంచి ''సిగ్గేందుకురా మావ'' అనే మ‌రో పాట‌ను డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు.

'తిట్టినా బాగుంటాదే.. కొట్టినా బాగుంటాదే.. గర్ల్ ఫ్రెండు ఏమి చేసినా గారాభంగా ఉంటాదే..' అంటూ సాగిన ఈ పాటకు చేత‌న్ భ‌ర‌ద్వాజ్ ట్యూన్ సమకూర్చారు. దీనికి లిరిసిస్ట్ భాస్కరభట్ల యూత్ ని ఆకట్టుకునేలా సాహిత్యం రాయగా.. సింగర్ అనురాగ్ కుల‌కుర్ణి తనదైన శైలిలో ఆలపించారు. ఇందులో అమ్మాయిలు దేవతలు.. అబ్బాయిలు భక్తులు.. అందుకే అమ్మాయిలు ఒక్కోసారి కోపగించొచ్చు.. ఒక్కోసారి కనికరించవచ్చు.. అందుకే అమ్మాయిలు తిట్టినా సిగ్గు పడకుండా వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయాలని చెబుతున్నారు. 'సిగ్గేందుకురా మావ' పాటలో హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం డాన్స్ మూమెంట్స్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్నాయి.

కాగా, 'SR క‌ళ్యాణమండంపం EST 1975' చిత్రంలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా క‌థ‌ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించ‌డం విశేషం. ఇందులో విలక్షణ నటుడు సాయి కుమార్ - తనికెళ్ల భరణి - తులసి - శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేట‌ర్స్ లోనే విడుద‌ల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఇటీవ‌లే శంక‌ర్ పిక్చ‌ర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకి ద‌క్కించుకున్నారు. థియేటర్లు తెరుచుకున్న తర్వాత ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.Full View
Tags:    
  • Sigguendukura Mama Lyrical Song 
  • Kiran Abbavaram 
  • Priyanka Jawalkar 
  • Sr Kalyana Mandapam Songs 
  • Telugu News 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS