పీకే26 తో సామజవరగమన కంటిన్యూ

Update: 2020-02-14 05:45 GMT
అల వైకుంఠపురంలో సినిమాకు అంత హైప్‌ రావడానికి కారణం పాటలు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సామజవరగమన పాట సోషల్‌ మీడియాలో ఏ స్థాయిలో ట్రెండ్‌ అయ్యిందో చెప్పనక్కర్లేదు. ఇప్పటికి కూడా ఆ పాట చాట్‌ బస్టర్స్‌ లో టాప్‌ లోనే కొనసాగుతుంది. థమన్‌ సంగీతం అందించిన ఆ పాటను సిద్‌ శ్రీరామ్‌ పాడాడు. నార్త్‌ నుండి థమన్‌ ఈ సింగర్‌ ను సౌత్‌ కు ఇంపోర్ట్‌ చేశాడు. గతంలో ఎంతో మంది నార్త్‌ సింగర్స్‌ సౌత్‌ లో పాడారు. కాని ఈ స్థాయిలో విజయాన్ని సాధించింది మాత్రం సిద్‌ శ్రీరామ్‌ మాత్రమే.

తాజాగా ఈ సింగర్‌ ప్రదీప్‌ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో నీలినీలి ఆకాశం పాటను పాడాడు. ఆ పాట కూడా సోషల్‌ మీడియాలో సెన్షేషన్‌ అయ్యింది. శ్రీరామ్‌ గాత్రంలో మ్యాజిక్‌ ఉందని.. అతడు ఏ నటుడికి అయినా పాడగలడని మరోసారి నిరూపితం అయ్యింది. బాలీవుడ్‌ లో టాప్‌ సింగర్‌ అయిన ఈయన ప్రస్తుతం టాలీవుడ్‌ లో కూడా మోస్ట్‌ వాంటెడ్‌ అయ్యాడు. సిద్‌ శ్రీరామ్‌ క్రేజ్‌ ను టాలీవుడ్‌ లో కంటిన్యూ చేసేందుకు థమన్‌ పీకే 26 చిత్రం వకీల్‌ సాబ్‌ లో కూడా పాడివ్వడం జరుగుతుంది.

పవన్‌ కళ్యాణ్‌ ‘పింక్‌’ రీమేక్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కు కాస్త దూరంగా ఉంటుంది. అయినా కూడా థమన్‌ ఒక ప్రత్యేకమైన పాటను పవన్‌ ఇమేజ్‌ కు తగ్గట్లుగా ట్యూన్‌ చేశాడట. ఆ పాటను సిద్‌ శ్రీరామ్‌ తో పాడివ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. పీకే 26 చిత్రంలో సిద్‌ పాట ఉంటే మరోసారి అతడి పేరు మారు మ్రోగి పోవడం ఖాయం. త్వరలోనే ఆ పాటను రికార్డ్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా థమన్‌ సిద్‌ తో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేయడంతో వీరిద్దరు పీకే 26 కోసమే కలిశారంటూ ప్రచారం జరుగుతోంది.
Tags:    

Similar News