• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోయిన్ తో డేటింగ్...

హీరోయిన్ తో డేటింగ్ కన్ఫామ్ చేసిన శుభ్ మన్ గిల్..!

By - Tupaki Desk
Update: 2022-11-16 01:30 GMT
యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తన ఆట తీరుతోనే కాకుండా గాసిప్స్ తోనూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. 23 ఏళ్ళ శుభ్ మన్ గిల్  ఇప్పటి వరకు 12 వన్డేలు.. 11 టెస్టులు ఆడాడు. వన్డేల్లో 579 పరుగులతో పాటు ఒక సెంచరీ చేశాడు. ఇక టెస్టుల్లో 597 పరుగులు చేశాడు. భవిష్యత్తులో టీం ఇండియాలో స్టార్ ప్లేయర్ గా అయ్యే అవకాశాలు శుభ్ మన్ గిల్ లో పుష్కలంగా ఉన్నాయని పలువురు మాజీ క్రికెటర్లు సైతం కితాబిచ్చారు.

వన్డేల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన శుభ్ మన్ గిల్ పొట్టి క్రికెట్లో అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. న్యూజిలాండ్ తో జరిగే టీ20 సిరీస్ కు శుభ్ మన్ గిల్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలోనే టీం ఇండియాతో కలిసి న్యూజిలాండ్ కు పయనమయ్యాడు. ఓపెనర్ కోటాలో జట్టులో స్థానం దక్కించుకున్న శుభ్ మన్ గిల్ న్యూజిలాండ్ పర్యటనలో రాణిస్తే అతడి భవిష్యత్తుకు ఢోకా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
ఇదిలా ఉంటే శుభ్ మన్ గిల్ ఇటీవల ఓ పంజాబీ చాట్ షో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడికి సారా అలీఖాన్ తో మీరు డేటింగ్ చేస్తున్నారా? అనే ప్రశ్న హోస్ట్ నుంచి ఎదురైంది. దీనికి శుభ్ మన్ గిల్ స్పందిస్తూ 'నేను డేటింగ్ లో ఉండొచ్చు.. ఉండకపోవచ్చు..' అంటూ సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశాడు.

అయితే  ఆ వెంటనే బాలీవుడ్లో అత్యంత ఫిట్ గా ఉండే నటి ఎవరని శుభ్ మన్ గిల్ ను హోస్ట్ ప్రశ్నంచాడు. దీనికి శుభ్ మన్ 'సారా' అంటూ బదులిచ్చాడు. దీంతో సారాతో డేటింగ్ విషయాన్ని శుభ్ మన్ చెప్పకనే చెప్పినట్లు అయిందని క్రికెట్ అభిమానులు కన్ఫామ్ చేస్తూ పండుగ చేసుకుంటున్నారు.

ఇక గతంలోనూ శుభ్ మన్ గిల్ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్ తో ప్రేమలో ఉన్నాడనే ప్రచారం జరిగింది. ఆ మధ్య వీరిద్దరు ఒకరి ఇన్ స్టాను ఒకరు ఫాలో అవడం.. ఫోటోలు పరస్పరం షేర్ చేసుకోవడం లాంటివి జరిగాయి. ఈ నేపథ్యంలోనే వారి మధ్య ప్రేమాయణం నడుస్తుందనే టాక్ కొన్ని నెలలపాటు నడిచింది.  

అయితే ఆ తర్వాత శుభ్ మన్ గిల్ 'దేవతలతో ప్రేమలో పడొద్దు' అంటూ ఒక పోస్ట్ షేర్ చేశాడు. దీంతో వీరివురి మధ్య బ్రేకప్ అయిందనే కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత శుభమన్ గిల్ బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తో డిన్నర్ వెళ్లాడు. దీంతో వీరిద్దరి మధ్య సంథింగ్.. సంథింగ్ నడుస్తుందనే ప్రచారం జోరందుకుంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • IndianCricketer 
  • ShubmanGill 
  • BollywoodActress 
  • SaraAliKhan 
  • ShubmanSaraDating 
  • CelebrityCouple 
  • SaraTendulkar 
  • FilmIndustry 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS