నాయుడు గారి పిల్ల థ్యాంక్స్ చెప్పింది

Update: 2016-04-29 15:16 GMT
మామూలుగా బయట వారికైతే ఈ ప్రాజెక్టులోకి నన్ను తీసుకున్నందుకు థ్యాంక్యూ థ్యాంక్యూ అంటూ ఎన్నిసారులైనా చెప్పొచ్చు. కాని సొంత ఫ్యామిలీకి కూడా చెప్పాలంటారా ఈ కృతజ్ఞతలు? మన నాయుడు గారి పిల్ల మాత్రం చెప్పేస్తోంది.

''శభాష్‌ నాయుడు'' అంటూ ఒకేసారి తెలుగ - తమిళ - కన్నడ బాషల్లో లెజండరీ కమల్‌ హాసన్‌ ఇప్పుడొక సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమల్‌ కూతురిగా.. అదేనండీ నాయుడు గారి పిల్లగా ఏకంగా సొంత కూతురు శృతి హాసన్‌ నటిస్తోంది. కమల్‌ తో కలసి చిన్నప్పుడు హే రామ్‌ అనే సినిమాలో నటించిన ఈ సన్నజాజి.. పెద్దయ్యాక ఒక్కాసారి కూడా ఎప్పుడూ ఆయన సినిమాల్లో మెరవలేదు. ఇప్పుడు మాత్రం ఏకంగా తండ్రీ కూతుళ్లిద్దరూ కలసి లీడ్‌ రోల్ లో ఇరగదీస్తారట. నాయుడు గారు ఎలాగో 100కి 200 మార్కులు కొట్టేస్తారు.. మరి ఆయన ప్రక్కన ఈవిడి శృతి ఏ రేంజులో ఉంటుందనే విషయం చూడాలి.

డాడ్ అండ్ డాటర్‌ కలసి నటించిన సినిమాలు చాలా అరుదుగానే వస్తున్నాయి. తెలుగులో అయితే మనం మోహన్‌ బాబు అండ్‌ లక్ష్మీ మంచు.. అలాగే నాగబాబు అండ్‌ నిహారిక.. ఇలా కొంతమందిని చూసే ఛాన్సుంది. కాని లీడ్‌ రోల్స్ లో వీరెవ్వరూ ఇంకా ఏమీ ప్రయత్నించలేదు.
Tags:    

Similar News