లాస్ ఏంజెలెస్ లో శృతి హాసన్

Update: 2018-10-19 09:43 GMT
హీరోయిన్ గా తెలుగు-తమిళ -హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించిన శృతి హాసన్ ఇప్పుడు సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.  ఆఫర్లు తగ్గడమో లేదా శృతికే  ఇంట్రెస్ట్ లేక ఒప్పుకోవడం లేదో తెలీదు గానీ ఈమధ్య చెప్పుకోదగ్గ సినిమాలేవీ చేయలేదు. చేతిలో కూడా సినిమాల్లేవు.  

'శభాష్ నాయుడు' సినిమా షూటింగ్ కంప్లీట్ అయినా ఇప్పటివరకూ రిలీజ్ కాలేదు. మరోవైపు హిందీలో మహేష్  మంజ్రేకర్ దర్శకత్వంలో విద్యుత్ జమ్వాల్ హీరో గా ఒక సినిమా ఏప్రిల్ లో ప్రారంభం అయింది కానీ ఇప్పటివరకూ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన మరో అప్డేట్ బయటకు రాలేదు. ఇదిలా ఉంటే శృతి ప్రస్తుతం ఇంటర్నేషనల్ సింగర్ గా ఎదగాలని ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో మ్యూజిక్ ప్రొడ్యూసర్ న్యుక్లియా తో కలిసి ఒక ఆల్బమ్  తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది.

తాజాగా లాస్ ఏంజెలెస్ కు వెళ్లిందట ఈ బ్యూటీ.  తన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన శృతి 'లాస్ ఏంజెలెస్ లో ఉన్నాను.. వర్క్ మోడ్ లో ఉన్నాను' అని క్యాప్షన్ ఇచ్చింది. కాకపోతే నుక్లియాతో కలిసి చేసి ఆల్బమ్ పనిమీద వెళ్ళిందా లేదా అమెరికాలో ఉన్న ఇంటర్నేషనల్ సింగర్స్ తో కలిసి పనిచేయడానికి వెళ్ళిందా అనేది మాత్రం వెల్లడించలేదు.  ఏదేమైనా శృతి మాత్రం ఇతర హీరోయిన్ల లాగా సినిమాల్లో కాకుండా సంగీతంలో ఓలలాడుతోంది.


Tags:    

Similar News