ఈ రెండు సినిమాలు శృతిని ఫామ్ లోకి తీసుకొచ్చాయా..??
స్టార్ హీరోయిన్ శృతిహాసన్.. చివరిగా మూడేళ్ల క్రితం కాటమరాయుడు సినిమాలో కనిపించింది. ఆ తర్వాత రీసెంట్ గా మాస్ రాజా రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటించి మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. అంతకుముందు చేసిన కాటమరాయుడు, హిందీ బేహేన్ హోగి మేరీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. ఆ సినిమాల తర్వాత శృతి కాస్త సినిమాలకు దూరంగా వెళ్ళిపోయింది. ఒక దశలో ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తుందనే నమ్మకం కూడా లేదని కథనాలు కూడా వెలువడ్డాయి. ఎందుకంటే అప్పుడు అమ్మడు ఫారెన్ కుర్రాడితో ప్రేమలో మునిగిపోయింది. ఇక ఇద్దరూ కొంతకాలం తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయి ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఇక అప్పటినుండి తిరిగి తన సినీ కెరీర్ పై, మ్యూజిక్ పై ఫోకస్ పెడుతోంది అమ్మడు.
శృతి టాలెంట్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా మాత్రమే కాకుండా గాయనిగా, మ్యూజిక్ కంపోజర్ గా శృతి సంగీత ప్రియులకు సుపరిచితమే. అయితే ఈ టాలెంటెడ్ భామ.. ఇదివరకే ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేసేసింది. అప్పటినుండి శృతి తనకు సంబంధించిన మ్యూజిక్ వీడియోస్, సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తూనే ఉంది. అయితే ఇటీవల క్రాక్ సినిమా చేసి మళ్లీ సినిమాలలో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం అమ్మడి కెరీర్ మళ్లీ పుంజుకుందని చెప్పాలి. ఎందుకంటే క్రాక్ లైన్ లో ఉన్నప్పుడే పలు సినిమాలను ఓకే చేసేసింది. అయితే ఈ ఏడాది శృతికి బాగా కలిసోచ్చినట్లు ఉంది. ఎందుకంటే ఇటు క్రాక్ హిట్ తో పాటు బాలీవుడ్ లో 'ది పవర్' కూడా సంక్రాంతి సందర్బంగా జీప్లెక్స్ ఓటిటిలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితం సాధించిందట. ప్రస్తుతం ఈ రెండు సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లే అనిపిస్తుంది. ఇక త్వరలో విజయ్ సేతుపతి సరసన లాభం సినిమాలో మెరవనుంది.