#శ్రుతి.. కిక్కు ఎక్కేలా క్రాక్ చూపిస్తోంది

Update: 2020-12-09 13:30 GMT
ఇంత‌కుముందు మాస్ మ‌హారాజా ర‌వితేజ కిక్ సినిమాలోనే క్రాక్ చూపించారు. మ‌తి తప్పి విదేశాల్లో తిరిగేసే పేషెంట్ గా క‌నిపించారు రాజా. ఆ పాత్ర‌కు కిక్కుని ఆపాదించ‌డంలో సురేంద‌ర్ రెడ్డి ఎంతో పెద్ద స‌క్సెస‌య్యారు. బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద స‌క్సెసైంది ఆ చిత్రం.

ఇప్పుడు ఆ మూవీ కంటే డిఫ‌రెంట్ మూవీని చేస్తున్నారు ర‌వితేజ‌. క్రాక్ టైటిల్ తో గోపిచంద్ మ‌లినేని ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. నిజ ఘ‌ట‌న‌ల నుంచి స్ఫూర్తి పొంది తెర‌కెక్కిస్తున్న క్రాక్ కాప్ డ్రామా ఇద‌ని తొలి నుంచి చెబుతున్నార‌. ఇక ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తున్న శ్రుతిహాస‌న్ పాత్ర ఎలా ఉంటుంది? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్.

కానీ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో శ్రుతి షేర్ చేస్తున్న ఫోటోలు చూస్తుంటే క్రాక్ ఫుల్ గా ఎక్కింద‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి. శ్రుతి అల్ట్రా స్మార్ట్ గా మారిపోయి క‌నిపిస్తోంది. బ‌లుపు టీమ్ తో చేరి క్రాక్ మూవీలో న‌టించ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని తెలిపింది. తాజాగా శ్రుతి షేర్ చేసిన ఈ ఫోటో చూస్తుంటే ఏదో పార్క్ లో ఫోటోషూట్ అని అర్థ‌మ‌వుతోంది. చుట్టూ గులాబీ రేకులు ప‌రిచిన‌ట్టుగా పింక్ ఫ్ల‌వ‌ర్స్ ఎంతో అందంగా క‌నిపిస్తున్నాయి. ఆ మ‌ధ్య‌లో ఇదిగో ఇలా కిరాక్ ఎక్స్ ప్రెష‌న్ తో క్రాక్ ఫోజిచ్చింది శ్రుతి. భాగ్య‌ల‌క్ష్మి ఇమేజ్ కి పూర్తి భిన్న‌మైన ఎక్స్ ప్రెషన్ అది. ర‌వితేజ స‌ర‌స‌న క్రాక్.. ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న వ‌కీల్ సాబ్ చిత్రాల్లో న‌టిస్తోంది. తదుప‌రి తెలుగు స్టార్ హీరోల సర‌స‌న ఆఫ‌ర్లు వెయిటింగ్ అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News