డిజిట‌ల్ ఎంట్రీకి అంతగా ఆలోచించాలా?

Update: 2019-07-10 17:30 GMT
డిజిట‌ల్ రాక‌తో సీన్ అంతా మారిపోతోంది. పెద్ద తెర‌.. బుల్లితెర‌తో పాటు డిజిట‌ల్ లోనూ అవ‌కాశాలు పెర‌గ‌డంతో స్టార్లు అటువైపు వెళ్లేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు స్టార్లు డిజిట‌ల్ వేదిక‌పై వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నారు. ఇప్పుడు అదే బాట‌లో శ్రుతిహాస‌న్ కూడా ట్రావెల్ చేయ‌నుంద‌ని తెలుస్తోంది.

విదేశీ ప్రియుడు మైఖేల్ కోర్స‌లే నుంచి విడిపోయాక శ్రుతి ప్ర‌స్తుతం కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఒక‌ట్రెండు త‌మిళ సినిమాల‌కు క‌మిటైంది. అలాగే తెలుగులో మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న ఓ సినిమాకి ఓకే చెప్పాన‌ని ఇదివ‌ర‌కూ వెల్ల‌డించింది. తాజాగా డిజిట‌ల్ లో ఆఫ‌ర్ గురించి శ్రుతి ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని రివీల్ చేసింది. ``డిజిట‌ల్ వేదిక‌పై ర‌క‌ర‌కాల సీజ‌న్స్ ని ఎంజాయ్ చేసేందుకు ప్రేక్ష‌కులు ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌డం ప‌రిశీలించాను. మ‌న‌ల్ని మ‌నం ఈ రంగంలోనూ ఆవిష్క‌రించుకునే ఆవకాశం ఉంది`` అని తెలిపింది.

ఇప్ప‌టికే ప‌లు వెబ్ సిరీస్ ల‌లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ వేటికి ఓకే చెప్పాలి? అన్న‌ది ఆచితూచి ప్లాన్ చేస్తున్నా. ముందు న‌న్ను నేను స‌మాధాన ప‌రుచుకోవాల్సి ఉంద‌ని శ్రుతి తెలిపింది. పెద్ద తెర‌పై అగ్ర క‌థానాయిక‌గా ఓ వెలుగు వెలిగిన శ్రుతి కెరీర్ ఒడిదుడుకులు తెలిసిందే. కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో ప్రేమాయ‌ణం బిగ్ బ్రేకింగ్ పాయింట్. విదేశాల్లో మ్యూజిక్ బ్యాండ్ ద్వారా గాయ‌నిగా పాపుల‌ర‌య్యేందుకు చేసిన ప్ర‌య‌త్నం ఆశించినంత స‌క్సెస్ కాలేదు. ప్రియుడితో ల‌వ్ బ్రేక‌ప్ త‌ర్వాత తిరిగి క‌థానాయిక‌గా బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.  ప్ర‌స్తుతం శ్రుతి వెబ్ సిరీస్ ల‌పైనా ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తోంది. మ‌రి ఈ కొత్త ప్లాట్ ఫామ్ పై ఏ స్థాయిలో మెప్పించ‌నుంది? అన్న‌ది వేచి చూడాల్సిందే.

    

Tags:    

Similar News