ఒకేసారి 3 చిత్రాలు.. కానీ బాధపడుతున్న నందు!

టాలీవుడ్ నటుడు శ్రీ నందు ఇప్పుడు వరుస సినిమాలతో థియేటర్స్ లోకి వస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-12-29 15:04 GMT

టాలీవుడ్ నటుడు శ్రీ నందు ఇప్పుడు వరుస సినిమాలతో థియేటర్స్ లోకి వస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దండోరా మూవీలో కీలక పాత్రలో నటించిన నందు.. తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించారు. ఆ సినిమాకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

అదే సమయంలో జనవరి 1వ తేదీన ఆయన హీరోగా నటించిన సైక్ సిద్ధార్థ్ తో పాటు విలన్ గా యాక్ట్ చేసిన వనవీర సినిమాలూ డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల జవనరి 1వ తేదీన విడుదల అవుతున్నాయి. అయితే రీసెంట్ గా వనవీర మేకర్స్.. టైటిల్ మార్పు విషయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఆ సమయంలో వనవీరను తోటి నటీనటులు పట్టించుకోవడం లేదని, సహకారం అందించడం లేదని ఆరోపించారు. నందు కోసమే వారు మాట్లాడారని అంతా భావించారు. ఇప్పుడు ఆ విషయంపై ఓ ఇంటర్వ్యూలో ఆయన రెస్పాండ్ అయ్యారు. ఏ సినిమా కు అయినా ఫిజికల్ ప్రమోషన్స్ లేకపోయినా సపోర్ట్ చేయాల్సి ఉందని, తాను అది చేశానని తెలిపారు.

"టీజర్ లాంఛ్ అయినప్పుడు పోస్ట్ పెట్టా.. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు వెంటనే ప్రొడ్యూసర్ కు మెసేజ్ చేశా.. రేపు అన్నారు కదా.. దీంతో వాళ్లు రేపు ప్రెస్ మీట్.. ఈరోజు ట్రైలర్ లాంఛ్ అని చెప్పారు.. సరే ఓకే అనేశాను.. ఆ రెండే అడగ్గా ఒకటి చేశాను.. రెండోది చేసేలోపు ప్రెస్ మీట్ జరిగిపోయింది" అని తెలిపారు.

2025లో చేసిన వర్క్ వన్ వీక్ లో వరదలా వచ్చిందని, ఎక్స్పీరియన్స్ ఏంటని హోస్ట్ అడగ్గా.. "ఆనందపడేలోపు బాధపడే ప్రెస్ మీట్లు వస్తున్నాయి.. దండోరా హిట్ అయ్యేలోపు.. సపోర్ట్ చేయడం లేదని ప్రెస్ మీట్ వచ్చింది. మూడు సినిమాలు వారం రోజుల్లో విడుదలైనప్పుడు సోలో హీరోగా ప్రమోషన్స్ చేస్తున్నా. కమిట్ అయిన సినిమా సక్సెస్ అయినా వెళ్లలేకపోయాను.. ఇటు ఈ సినిమాకు వెళ్లలేకపోయా. ఆనందపడాల్సిన సమయంలో బాధపడుతున్నా" అని చెప్పారు.

"దండోరాతో హిట్ కొట్టా.. అందరూ నాకోసం బాగా రాశారు. ఆ సక్సెస్ మీట్ అటెండ్ అయ్యి దాన్ని సొంతం చేసుకోలేకపోతున్నా.. విలన్ గా సినిమా చేస్తున్నా.. ఆ ప్రమోషన్స్ కు రావడం లేదని నెగిటివ్ రిమార్క్ వచ్చింది. హీరోగా నటించిన సైక్ సిద్ధార్థ్ రిలీజ్ ఉంది. కానీ ఏదో తప్పు చేశానని కొందరు అనుకుంటున్నారు. గుడ్ విల్ పోతుందన్న బాధగా ఉంది" అని తెలిపారు.

"ఒకేసారి మూడు సినిమాలును ఎలా ప్రమోట్ చేయాలో నేర్చుకోవాలి.. ఇలాంటి సందర్భాలు మళ్లీ నా జీవితంలోకి రావాలి.. కానీ బెటర్ గా హ్యాండిల్ చేయాలి. నేను చేసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు ఇవ్వాలి.. పెద్ద బ్యానర్ల నుంచి ఆఫర్లు అందుకోవాలి. అలా జరగాలని దేవుడి దీవించాలని కోరుకుంటున్నా" అని చెప్పారు శ్రీనందు.

Tags:    

Similar News