అర్జున్ ఇష్యూ గురించి నాని హీరోయిన్!!

Update: 2018-10-22 08:24 GMT
ఇప్పుడు సినిమా పరిశ్రమకు సంబంధించి మీటూ గురించిన చర్చే ఎక్కువ జరుగుతోంది. పెద్ద హీరోల పేర్లు ఎవరివి విన్పించలేదే అనుకుంటున్న తరుణంలో కన్నడ భామ శృతి హరిహరన్ ఏకంగా యాక్షన్ కింగ్ అర్జున్ మీదే ఆరోపణలు చేయడం శాండల్ వుడ్ లోనే కాదు ఇక్కడ కూడా సెగలు రేపింది. నిబునన్(తెలుగు కురుక్షేత్రం)షూటింగ్ సందర్భంగా అందులో భార్య పాత్రలో నటించిన తనతో అర్జున్ చాలా అసభ్యంగా ప్రవర్తించాడని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన శృతి వ్యాఖ్యలను ఖండిస్తూ దర్శకుడు అరుణ్ వైద్యనాధన్ హీరో అర్జున్ ఇద్దరూ విడివిడిగా స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అసలు ఏది నిజం ఏది అబద్దమో తెలియని అయోమయంలో ఫ్యాన్స్ తో పాటు మీడియా వర్గాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా శ్రద్ధ శ్రీనాధ్ ఓ కొత్త వెర్షన్ వినించడం మరో చర్చకు దారి తీస్తోంది. శ్రద్ధ శ్రీనాధ్ నాని జెర్సీలో నటిస్తోంది. యుటర్న్ ఒరిజినల్ వెర్షన్ లో నటించింది తనే. తమిళ్ బ్లాక్ బస్టర్ విక్రమ్ వేదాలో మాధవన్ భార్య పాత్ర తనకు మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. మీటూ చర్చకు వచ్చిన నేపధ్యంలో శ్రద్ధ శ్రీనాధ్ మాట్లాడుతూ తనకు శృతి హరిహరన్ తెలుసనీ గతంలో కొచ్చిన్ నుంచి బెంగళూర్ కు వెళ్తున్న బస్సులో ఓ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనను  ఒక షోలో పాల్గొన్న సమయంలో షేర్ చేసుకుందని చెప్పింది. కానీ అర్జున్ విషయంలో చేసిన ఆరోపణలకు మాత్రం నేరుగా సమాధానం ఇవ్వలేదు. సో మీటూ సంగతేంటో కానీ ఇప్పటి దాకా బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో నిజాలు మాత్రం ఆలస్యంగా అయినా బయటికి వస్తున్నాయి
   

Tags:    

Similar News