500 మంది హీరోయిన్‌ను చుట్టేస్తే..

Update: 2015-07-03 07:28 GMT
ఉన్నట్టుండి ఓ అందాల హీరోయిన్‌ ముంబై వీధుల్లోకి వచ్చింది. తన ఫేవరెట్‌ కిచెన్‌ షోరూమ్‌కి వెళ్లింది. అక్కడ తనకి కావాల్సినవాటిని ఆర్డర్‌ చేసింది. తన పని పూర్తవ్వగానే అక్కణ్ణుంచి రిటన్‌ అవ్వడానికి బైటికొచ్చింది. అంతే ఒక్కసారిగా 500పైగా అభిమానులు సదరు హీరోయిన్‌ని చుట్టు ముట్టేశారు. ఎటూ పోనివ్వకుండా మూగేశారు. ఊహించని ఈ ఘటనకు షాక్‌ తినడం ఆ హీరోయిన్‌ వంతయ్యింది.

అసలీ సీన్‌లో హీరోయిన్‌ ఎవరంటే.. 'ఆషికి 2', 'ఏక్‌ విలన్‌' చిత్రాలతో సూపర్‌స్టార్‌గా అవతరించిన శ్రద్ధాకపూర్‌. ఈ భామకి అసాధారణమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరుగుతోందనడానికి ఇదే తాజా ఉదాహరణ. సినిమా సినిమాకి ఈ అమ్మడికి పాలోయింగ్‌ పెరుగుతోంది. శ్రద్ధాతో ఫోటోల కోసం, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడే ఫ్యాన్స్‌ పెరిగిపోయారు. అక్కణ్ణుంచి పోలీస్‌ ఎస్కార్ట్‌ సాయంతో ఏదోలా అప్పటికి బైటపడినా జీవితంలో ఇలాంటి తప్పు మరోసరి చేయకూడదని నిర్ణయించుకునేంతగా హరాస్‌ అయ్యింది. ఆ క్షణం మెరుపు వేగంతో గార్డ్స్‌ తనని కాపాడి ఉండకపోతే అభిమానులు నలిపేసేవారే. గుంపులోంచి కార్‌ రోడ్డుపైకి వచ్చేప్పటికి గంటల కొద్దీ సమయం పట్టిందంటే ఊహించవచ్చు. ఓ వైపు అభిమానుల్ని మనసులో అభినందిస్తూనే, తనకి కలిగిన ఇబ్బంది గురించి ఆలోచించుకోవాల్సొచ్చింది. దటీజ్‌ ఫ్యాన్స్‌ అని ఈ భామకి అర్థమైందన్నమాట.

Tags:    

Similar News