డ్రగ్స్ కేసు: ఎన్.డీ.పీ.ఎస్ యాక్ట్ అంటే?

Update: 2020-09-08 17:35 GMT
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ మృతి కేసులో కీలక ట్విస్ట్ ఈరోజు జరిగింది. డ్రగ్స్ మూలాలు బయటపడడంతో విచారించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అతడి ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. అంతకుముందే ఆమె సోదరుడు షోవిక్, మేనేజర్ శామ్యూల్ ను కూడా అరెస్ట్ చేశారు.

రియా, షోవిక్, శామ్యూల్ ను ఎన్.డీ.పీ.ఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తెలిపారు. దీంతో ఈ యాక్ట్ ఏంటి? దానికి ఎంత శిక్ష పడుతుంది.? ఏఏ సెక్షన్లు ఉంటాయనేది ఆసక్తిగా మారింది.

ముఖ్యంగా డ్రగ్స్ కేసుల్లో ఈ ఎన్.డీ.పీ.ఎస్ యాక్ట్ కేసులు పెడుతారు. నార్కోటిక్స్ అండ్ సైకో ట్రోపిక్ సబ్ స్టెన్సెస్ యాక్ట్ -1985(ఎన్.డీ.పీ.ఎస్) లోని సెక్షన్ 20బి, 28,29 కింద షోవిక్, శా మ్యూల్ లను అరెస్ట్ చేశారని సమాచారం.

ఎన్.డీ.పీ.ఎస్ యాక్ట్ సెక్షన్ 20బి కింద డ్రగ్స్ కొనుగోలు చేయటం.. ఉత్పత్తి చేయటం, తమ దగ్గర ఉంచుకోవడం, అమ్మటం, రవాణా చేయడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఎన్.డీ.పీ.ఎస్ యాక్ట్ సెక్షన్ 28లో నేరానికి ప్రయత్నించినందుకు శిక్ష విధిస్తారు. సెక్షన్ 29లో రెచ్చగొట్టడం.. నేరపూరిత కుట్రకు పాల్పడడానికి శిక్ష విధిస్తారు. షోవిక్, శ్యామూల్ పై ఇదే ఎన్.డీ.పీ.ఎస్ యాక్ట్ కేసులు పెట్టారు.

ఎన్.డీ.పీ.ఎస్ యాక్ట్ కేసుల్లో దోషులుగా తేలితే వారికి పదేళ్ల వరకూ శిక్ష విధించవచ్చు. విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినా సరఫరా చేసినా ఈ సెక్షన్ కింద 10-20 ఏళ్ల వరకు జైలు శిక్ష , లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు.
Tags:    

Similar News