సినీ న‌టుడు శివాజీ రాజాకు గుండెపోటు

Update: 2020-05-06 04:00 GMT
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సీనియ‌ర్ నటుడు శివాజీ రాజా గుండెపోటు వచ్చింది. అక‌స్మాత్తుగా ఆయన గుండెపోటుకు గుర‌వడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన హైద‌రాబాద్‌లోని స్టార్ ఆస్ప‌త్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే అత‌డి పరిస్థితి సీరియస్ ఏమి కాదు అని తెలుస్తోంది. దీని పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ విషయంపై సురేశ్‌ కొండేటి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడే శివాజీరాజాతో తాను మాట్లాడానని తెలిపారు. బీపీ డౌన్ అయిపోయి గుండెపోటు వ‌చ్చింద‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం అత‌డికి స్టంట్ వేస్తారని చెప్పారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో శివాజీరాజా కొన్ని రోజులుగా సొంత ఫామ్‌హౌజ్‌లో కూరగాయలు పండిస్తూ సినిమా కార్మికులకు ఉచితంగా అందిస్తున్నాడ‌ని తెలిపారు. గతేడాది మా అసోసియేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత బయట పెద్దగా కనిపించడం లేదు.

ప్ర‌శాంతంగా ఉన్న తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో శివాజీరాజాకు గుండెపోటు రావ‌డంతో అంద‌రూ షాక్‌కు గుర‌య్యారు. 30 ఏళ్లుగా ప‌రిశ్ర‌మ‌లో న‌టుడిగా కొన‌సాగుతున్న శివాజీ రాజా వందల సినిమాలు చేశాడు. అమృతం సీరియల్‌తో అంద‌రినీ అల‌రించాడు.
Tags:    

Similar News