• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్ సినిమాలో...

ఎన్టీఆర్ సినిమాలో శివగామి...?

By - Tupaki Desk
Update: 2020-09-20 12:10 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌ పై రాధాక‌ష్ణ‌ (చినబాబు) - నంద‌మూరి క‌ల్యాణ్‌ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా రానున్న ఈ చిత్రానికి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తారక్ 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ కంప్లీట్ చేసిన వెంటనే ఈ సినిమాని స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది. ఈ గ్యాప్ లో లీడ్ యాక్టర్స్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్న మేకర్స్.. ఓ కీలకమైన పాత్ర కోసం సీనియర్ నటి రమ్యకృష్ణ ని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.

కాగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో బలమైన లేడీ పాత్రలను క్రియేట్ చేస్తుంటాడనే విషయం తెలిసిందే. హీరోయిన్ తో పాటు ఇతర ఫిమేల్ రోల్స్ కూడా కథలో కీలకంగా ఉండేలా రాసుకుంటాడు. ఈ మధ్య అలాంటి క్యారక్టర్స్ లో సీనియర్ హీరోయిన్స్ ని నటింపజేస్తూ దానికి మరింత హుందాతనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. 'అత్తారింటికి దారేది' 'అ ఆ' సినిమాలలో నదియా.. 'సన్నాఫ్ సత్యమూర్తి'లో స్నేహ.. 'అజ్ఞాతవాసి' మూవీలో సీనియర్ నటి ఖుష్బూ.. 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో దేవయాని.. 'అల వైకుంఠపురంలో' సినిమాలో టబు పాత్రలు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఈ క్రమంలో తన నెక్స్ట్ సినిమాలో కూడా అలాంటి పవర్ ఫుల్ ఫిమేల్ క్యారక్టర్ ని డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం రమ్యకృష్ణ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా శివగామిగా పిలవబడుతున్న రమ్యకృష్ణ.. మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ 'సింహాద్రి' సినిమాలో ఐటెం సాంగ్ కి స్టెప్పులేసిన రమ్యకృష్ణ.. 'నా అల్లుడు' సినిమాలో అత్త క్యారక్టర్ లో కనిపించింది. మరోసారి వీరు తెరపై కనిపిస్తారేమో చూడాలి.
Tags:    
  • Ayinanu Poyi Ravale Hastinaku 
  • NTR 
  • Trivikram 
  • Ala Vaikuntapuramuloo 
  • Trivikram Upcoming Movies 
  • NTR 
  • Ram Charan 
  • RRR 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS