• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త‌మిళ ఎంపీకి శింబు...

త‌మిళ ఎంపీకి శింబు స‌వాల్...వైర‌ల్!

By - Tupaki Desk
Update: 2018-07-11 14:09 GMT
త‌మిళ స్టార్ హీరో - ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తోన్న `స‌ర్కార్` చిత్రం ఫ‌స్ట్ లుక్ పై వివాదం చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. సిగరెట్ తాగ‌కుండా ఉంటే విజ‌య్ ఇంకా స్టైలిష్‌ గా కనిపించేవారంటూ ఎంపీ అంబుమణి రామదాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దాంతోపాటు, ధూమపానాన్ని ప్రోత్సహించేలా ఈ పోస్టర్ ఉందంటూ సామాజిక కార్య‌క‌ర్త ఒక‌రు కేసు పెట్టారు. ఈ నేప‌థ్యంలో కోర్టు ఆదేశాల‌తో ఆ పోస్టర్ ను తొల‌గించారు. అయితే, అటువంటి పోస్టర్ విడుద‌ల చేసినందుకు రూ.10 కోట్లు ఫైన్ కట్టాలంటూ మరో పిటిషన్ కూడా దాఖ‌లైంది. ఈ నేప‌థ్యంలో విజ‌య్ కు ప‌లువురు కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు బాస‌ట‌గా నిలిచారు. ఆ పోస్ట‌ర్ పై అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డం....సినిమాలపై.. తమిళులపై చేసే దాడి  అని ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత  టి.రాజేందర్ మండిప‌డ్డారు. విజయ్ పై రాజకీయ కుట్ర జరుగుతోందని - ధూమ‌పానం హానిక‌రమైతే సిగరెట్లనే ప్రభుత్వం బ్యాన్ చేయొచ్చు కదా అని ప్ర‌శ్నించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ వివాదంపై హీరో శింబు ఘాటుగా స్పందించారు.

విజ‌య్ కు మ‌ద్ద‌తుగా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ధూమ‌పానంపై రాందాస్ బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని శింబు స‌వాల్ విసిరారు. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. స్వప్రయోజనాల కోసం రాందాస్ ....చిన్న పోస్టర్ పై వివాదం చేశారంటూ మండిప‌డ్డారు. ఇటువంటి చ‌ర్య‌లు ....సినిమా వాళ్ల క్రియేటివిటీని హ‌రిస్తాయ‌న్నాడు. గ‌తంలో ర‌జ‌నీకి కూడా ఈ త‌ర‌హా ఇబ్బందులు వ‌చ్చాయ‌ని, విజ‌య్ ను ఇబ్బందుల‌కు గురిచేసేందుకు కొంద‌రు కుట్ర ప‌న్నుతున్నార‌ని ఆరోపించాడు. ధూమ‌పానంపై బహిరంగ వేదికలపై చర్చించడానికి తాను రెడీ అని - దానికి రాందాస్ అంకుల్ ను ఆహ్వానిస్తాన‌ని శింబు స‌వాల్ విసిరారు. రాజకీయాలకు సినిమాను దూరం చేసేందుకు కుట్ర జ‌రుగుతోంద‌ని అన్నారు. ఈ త‌ర‌హా వివాదాల‌కు చ‌ర్చ‌ల ద్వారానే చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని అన్నారు. మ‌రి, శింబు స‌వాల్ కు రాందాస్ ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.
Tags:    
  • Shimbu 
  • Ambumani 
  • Vijay Sarkar Controversy 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS