కిస్ చేయ‌లేద‌ని న‌న్ను ల‌వ్ చేయ‌నంది - అక్ష‌య్ కుమార్

Update: 2021-01-20 06:30 GMT
బాలీవుడ్ లో ప్ర‌స్తుతం అక్షయ్ కుమార్ జోరు  మామూలుగా లేదు. ఇత‌ర అగ్రనటులు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే అవస్థలు పడుతుంటే.. ఈ హీరో మాత్రం ఏకంగా మూడ్నాలుగు సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నాడు. ఇందులోనూ స‌క్సెస్‌ పర్సెంట్ కూడా ఎక్కువే ఉంటుండడంతో బాక్సాఫీస్ మాగ్నెట్ గా మారిపోయాడు అక్షయ్.

సినిమాల‌ సెలక్షన్స్ లో అక్షయ్ కుమార్ రూటే సెపరేటు. స్టోరీస్ ఆయన జడ్జ్ చేసే విధానం.. డైరెక్టన్ ఎంచుకునే తీరు మిగిలిన వారికంటే ఆయన్ని ముందు వరసలో నిలబెడతాయి. ఇక ఆన్ స్క్రీన్ తనదైన మార్క్ యాక్టింగ్ తో బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ హీరోగా మారిపోయాడు అక్షయ్. దీంతో ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు సూట్ కేసులు పట్టుకొని వెంట తిరుగుతున్నారు.  బాలీవుడ్‌లో సక్సెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్న అక్షయ్ పారితోషికం ఇప్పుడు రూ.135 కోట్ల‌పైనే!

కాగా.. హౌస్‌ఫుల్‌-4 ప్రమోషన్‌లో భాగంగా ఇటీవ‌ల‌ కపిల్‌ శర్మ షోకు హాజరయ్యారు అక్షయ్‌. ఈ సందర్భంగా తన ఫస్ట్‌ లవ్‌, రిజెక్షన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తనతో కలిసి మూడు నాలుగు సార్లు డేట్‌కు వెళ్లాను. అంటే.. తనతో కలిసి సినిమాకు వెళ్లి, అట్నుంచి అటే రెస్టారెంట్‌కి వెళ్లి భోంచేసే వాళ్లం. అయితే.. నా ప్ర‌ధాన‌ సమస్య ఏంటంటే నాకు చాలా సిగ్గు. అందువ‌ల్ల‌ తనతో బయటకు వెళ్లినప్పుడు ఆమె భుజం మీద చేతులు వేయడం, తన చేతిని పట్టుకొని న‌డ‌వ‌డం.. కిస్‌ చేయడం వంటివి చేయలేదు. దాంతో ఆమె నన్ను రిజెక్ట్‌ చేసింది’’ అన్నారు అక్ష‌య్‌. దీంతో అంద‌రూ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేశారు.

ఈ కామెంట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీనిపై నెటిజ‌న్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘మీరు ప్రపోజ్‌ చేయాలని ఆ అమ్మాయి భావించి ఉటుంది. కానీ.. మీరేమో ముద్దు పెట్టలేదు కాబ‌ట్టే వదిలేసింది అంటున్నారు. బహుశా మీరే తప్పులో కాలేసిట్లున్నారు’’ అని అంటున్నారు. ‘‘అయినా.. మీకు ట్వింకిల్‌ లాంటి అందమైన భార్య లభించాలని రాసి పెట్టి ఉంది కాబట్టే.. ఆమె మిమ్మల్ని రిజెక్ట్‌ చేసింది’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. అక్షయ్‌-ట్వింకిల్‌ ఖన్నా వివాహ బంధానికి 20 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా భార్య ట్వింకిల్‌ ఖన్నాతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేశాడు అక్షయ్. ‘‘మనం ఇరవై సంవత్సరాల సమైక్యతకు చిహ్నంగా ఉన్నాం. నువ్వు ఇప్పటికీ నా హృదయాన్ని కదిలిస్తావు.. నన్ను నడిపిస్తావు. నువ్వు నాకు దూరంగా ఉన్నా నీ నవ్వు నన్ను సేదదీరుస్తుంది. వార్షికోత్సవ శుభాకాంక్షలు టీనా’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు అక్షయ్‌‌.  ఈ పోస్టుకు నెటిజ‌న్ల శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.
Tags:    

Similar News