• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అక్కడ పెద్ద ఆఫర్లు...

అక్కడ పెద్ద ఆఫర్లు వచ్చినా ఇక్కడే ఆమెకు ఇష్టం

By - Tupaki Desk
Update: 2022-05-05 23:30 GMT
టాలీవుడ్‌.. కోలీవుడ్‌.. బాలీవుడ్‌ ఇలా అన్ని వుడ్స్ లోనూ సినిమాలు చేస్తూ అన్ని చోట్ల కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు తెలుగు లో మొదటగా స్టార్‌ డమ్ దక్కించుకుంది. తెలుగు లో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాల్లో నటించింది. త్వరలో మహేష్ బాబుతో కూడా కలిసి నటించబోతున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా నేను ఎంతో బిజీగా ఉన్నాను.. స్టార్స్ సూపర్ స్టార్స్ తో నటించే అవకాశాలు వస్తున్నాయి ఇంతకంటే ఏం కావాలి అంటూ ఆమె ఆనందంగా ఉంది.

బాలీవుడ్‌ లో ఈ అమ్మడు త్వరలో సల్మాన్‌ ఖాన్‌ నటించబోతున్న సినిమాలో కనిపించబోతుంది. ఇంకా మరో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. స్టార్ హీరోల నుండి పూజా హెగ్డే నుండి ఆఫర్లు వస్తున్నాయి. కాని ఏ ఒక్క సినిమా కూడా ఒక మోస్తరు విజయాన్ని కూడా ఆమెకు ఇవ్వలేక పోతున్నాయి. దాంతో ఈ అమ్మడికి బాలీవుడ్‌ పై మోజు తగ్గినట్లుగా ఉంది. ఇదే సమయంలో టాలీవుడ్‌ వారిని కాకా పట్టే విధంగా కామెంట్స్ చేస్తోంది.

హిందీలో నాకు వరుసగా పెద్ద స్టార్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకున్నాను. కాని హిందీ సినిమాల్లో హీరోయిన్‌ పాత్ర విషయం లో నిరాశ ఉంటుంది. నాకు కూడా అదే తప్పలేదు.

హిందీలో ఎన్ని చేసినా కూడా రావాల్సిన గుర్తింపు రావడం లేదు అంది. అందుకే అక్కడ నుండి మెల్లగా సైడ్ అవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు లో మరింత బిజీ అవ్వాలని ఈ అమ్మడు కోరుకుంటున్నట్లుగా అనిపిస్తుంది.

అక్కడ పెద్ద సినిమాల్లో పెద్ద హీరోలతో ఆఫర్లు వచ్చినా కూడా తన మొదటి ప్రాముఖ్యత ఖచ్చితంగా తెలుగు సినిమాలకు మరియు తెలుగు హీరోలకు అంటూ చెప్పుకొచ్చింది. తనకు తెలుగు సినిమా పరిశ్రమలో అవకాశాలతోనే స్టార్‌ డమ్‌ వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. కనుక తెలుగు లోనే సుదీర్ఘ కాలం పాటు కొనసాగే యోచనలో ఉన్నట్లుగా ఆమె పేర్కొంది.

బాలీవుడ్‌ లో ఉన్న స్టార్ కిడ్స్ కొత్త వారికి అవకాశాలు లేకుండా.. రాకుండా చేస్తున్నారు. ఆ కారణంగానే పూజా హెగ్డే కు ఒక రేంజ్ సినిమాల వరకే అవకాశాలు వస్తున్నాయి. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు.. సినిమాలో కీలక పాత్రలు పూజా హెగ్డే వంటి వారికి అక్కడి వారు ఇవ్వడం లేదు. అందుకే బాలీవుడ్‌ లో సినిమా ల కంటే తెలుగు సినిమాలు ఉత్తమం అన్నట్లుగా పూజా హెగ్డే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.
Tags:    
  • Tollywood 
  • BollywoodFilms 
  • PoojaHegde 
  • TollywoodActress 
  • MaheshBabu 
  • TeluguMovies 
  • FilmIndustry 
  • ActressPooja 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS