గాత్రంతో మ్యూజిక్ డైరెక్టర్లను ఇంప్రెస్ చేసిన శర్వాణి.. నెట్టింట వీడియో వైరల్!
ప్రపంచంలో టెక్నాలజీ పెరిగాక ఎన్నో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా వెలుగులోకి వచ్చాక ఎక్కడో మరుగున పడిపోయిన టాలెంట్స్ బయట పడుతున్నాయి. ఆ విధంగా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ సినీ ఇండస్ట్రీలో కూడా అడుగు పెడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది యంగ్ టాలెంట్స్ సోషల్ మీడియా వేదికగా సింగింగ్.. డాన్స్.. యాక్టింగ్ లాంటి అదనపు టాలెంట్ తో మంచి ఫేమ్ దక్కించుకుంటున్నారు. అలాగే ప్రతిభకు తగిన అవకాశాలు అందుకుంటూ కెరీర్ డెవలప్ చేసుకుంటున్నారు. అయితే టెక్నాలజీ ఇంత పెరిగినా ఇప్పటికి దాని వాడకం తెలియని వారున్నారు.
అలాంటి వారి టాలెంట్ ఎవరో ఒకరు ఇతరుల టాలెంట్ ప్రూవ్ చేసేవారు గమనిస్తే సోషల్ మీడియా దృష్టికి తీసుకొస్తారు. అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా అది చేరాల్సిన వారికి చేరుతుంది. తాజాగా మెదక్ జిల్లా నారైంగి గ్రామానికి చెందిన శర్వాణి అనే అమ్మాయి టాలెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సురేంద్ర అనే వ్యక్తి శర్వాణి సింగింగ్ టాలెంట్ వీడియో తీసి ఐటీ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. అలాగే.. అమ్మాయి పేరు శర్వాణి.. తండ్రి లక్ష్మణచారి. ఓ పనికోసం ఆ ఊరేళ్లి ఈ ఆణిముత్యంను చూసాను. అద్భుతంగా పాడుతోంది. ఆమె టాలెంట్ ను ప్రోత్సహించాలంటూ కేటీఆర్ ను ట్యాగ్ చేసాడు.

వెంటనే స్పందించిన కేటీఆర్.. శర్వాణి వీడియోని టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ దేవిశ్రీ ప్రసాద్.. తమన్ లను ట్యాగ్ చేస్తూ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే దేవిశ్రీ ప్రసాద్ స్పందించి.. ఇలాంటి లోకల్ టాలెంట్ కోసమే మేం కూడా వెతుకుతున్నాం. ఈ అమ్మాయిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా అమ్మాయి టాలెంట్ ఎంకరేజ్ చేస్తామని తెలిపాడు. ప్రస్తుతం డిఎస్పీ నిర్వహిస్తున్న 'స్టార్ టు రాక్ స్టార్' అనే సింగింగ్ షోలో అవకాశం కల్పించనున్నట్లు దేవిశ్రీ హామీ ఇచ్చాడు. అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పందించి అమ్మాయి బంగారం అంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం శర్వాణి టాలెంట్ సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది.