• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లేచే మనసు ఆగక తప్పదా?

లేచే మనసు ఆగక తప్పదా?

By - Tupaki Desk
Update: 2018-09-25 11:40 GMT
రెగ్యులర్ పంధాలో కాకుండా కాస్త విభిన్నంగా కథలను ఎంచుకునే హీరో శర్వానంద్ సినిమా ఏదీ ఈ ఏడాది ఇప్పటిదాకా విడుదల కాలేదు. అనుకున్న రీతిలో షూటింగ్స్ సాగకపోవడంతో ఆలస్యం తప్పలేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో సాయి పల్లవి జోడిగా శర్వానంద్ చేస్తున్న పడి పడి లేచే మనసు డిసెంబర్ 21న విడుదల అవుతుందని గతంలోనే ప్రకటించారు. ఆ మేరకు అధికారికంగా పోస్టర్లు కూడా వచ్చాయి. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు అప్పుడు రావడం డౌటేనట. షూటింగ్ లో విఘ్నాలు ఏవి లేనప్పటికీ కొంత భాగం సంతృప్తి కరంగా రాకపోవడంతో హను రాఘవపూడి రీ షూట్ చేయాలనీ నిర్ణయించినట్టు వినికిడి.

దీనికి శర్వానంద్ కూడా మద్దతు తెలపడంతో నిర్మాతలు కూడా ఒప్పుకోక తప్పలేదని తెలిసింది. కాకపోతే ఇది అధికారికంగా ప్రకటించాడానికి మరికొంత సమయం పడుతుంది. రీ షూట్ కు మరో కారణం కూడా వినిపిస్తోంది. ఈ ఏడాది వచ్చిన ఓ రెండు చెప్పుకోదగ్గ సినిమాల్లో మెయిన్ పాయింట్ పడి పడి లేచే మనసులో ప్లాట్ లోని ట్విస్ట్ కు కాస్త దగ్గరి పోలికలు ఉండటంతో హను ఆ మేరకు పోలిక రాకుండా మార్పు చేసినట్టు చెబుతున్నారు. మరి ఇది నిజమైతే శర్వా సినిమాను సంక్రాంతి రేస్ లోనిలబెడతారా లేక అదే నెలాఖరుకు మణికర్ణికతో పోటీ కి సై అంటారా ఇంకా క్లారిటీ లేదు.

ఇది కాకుండా సుధీర్ వర్మతో మరో సినిమా చేస్తున్న శర్వానంద్ దాని షూటింగ్ కూడా సగానికి పైగానే పూర్తి చేసినట్టు సమాచారం. కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కావాల్సి ఉండటంతో పడి పడి లేచే మనసు తర్వాతే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ వాయిదా వార్త నిజమైతే కనక  ఒక్క సినిమా కూడా లేని సంవత్సరంగా శర్వానంద్ కు 2018 మిగిలిపోతుంది. అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్తే. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పడి పడి లేచే మనసులో శర్వానంద్ సాయి పల్లవి మొదటిసారి జట్టు కడుతున్నారు. ఆ మధ్య వచ్చిన కణం తర్వాత సాయి పల్లవి కూడా తెరమీద సందడి చేయలేదు. దీంట్లో చూడొచ్చు అనుకుంటే ఇది కూడా ఆలస్యమయ్యేలా ఉంది.  


Tags:    
  • Sharwanand 
  • Padi Padi Leche manasu Movie 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS