• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆచార్య నెలలో రాబోతున్న...

ఆచార్య నెలలో రాబోతున్న శర్వా

By - Tupaki Desk
Update: 2021-11-05 05:02 GMT
యంగ్‌ హీరో శర్వానంద్ ఈమద్య కాలంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చూపించడంలో విఫలం అవుతున్నాయి. ఈమద్య కాలంలో వచ్చిన శ్రీకారం సినిమా టాక్ పాజిటివ్ గా వచ్చినా వసూళ్ల విషయంలో సంతృప్తి దక్కలేదు. ఇక దసరా కానుకగా వచ్చిన మహా సముద్రం తీవ్రంగా నిరాశ పర్చింది. కథల ఎంపిక విషయంలో శర్వానంద్‌ కు గతంలో మంచి పేరు ఉండేది. కాని ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటూ మహా సముద్రం చూసిన తర్వాత అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మహా సముద్రం సినిమా నిరాశ పర్చినా కూడా ఎక్కువ ఇబ్బందికి గురి కాకుండా వెంట వెంటనే రెండు సినిమాలను విడుదల చేసేందుకు గాను శర్వా ప్లాన్‌ చేసుకున్నాడు. అందులో ఒకటి ఆడవాళ్లు మీకు జోహార్లు కాగా మరోటి ఒకే ఒక జీవితం. ఈ రెండు సినిమాలపై శర్వాతో పాటు ఆయన అభిమానులు ఆశలు పెట్టుకుని ఉన్నారు.

దీపావళి సందర్బంగా ఒకే ఒక జీవితం నుండి పోస్టర్‌ ను విడుదల చేశారు. సినిమాలో అమల నటిస్తున్నట్లుగా ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. కాని తాజా పోస్టర్ తో ఆమె ఈ సినిమాలో కీలక పాత్రల నటిస్తున్న విషయమై క్లారిటీ వచ్చింది. అమల అక్కినేని సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు ఈ సినిమా కోసం రావడం జరిగింది. మద్యలో ఒకటి రెండు సినిమాల్లో నటించినా కూడా అందులో ఆమె గెస్ట్‌ గానే కనిపించారు. మొదటి సారి ఈమె ఒక మంచి పాత్రలో ఆకట్టుకునేందుకు ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ ను చేసినట్లుగా తెలుస్తోంది. శర్వానంద్ మరియు అమల అక్కినేని మద్య ఉండే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి అన్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇక ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నట్లుగా పోస్టర్ లో పేర్కొన్నారు. సాదారణంగా అయితే ఫిబ్రవరి నెలను తెలుగు సినిమా స్కిప్ చేస్తుంది. ఎందుకంటే మార్చిలో వచ్చే పరీక్షల కోసం ఫిబ్రవరి నెల నుండే సన్నాహకాలు ఉంటాయి. కనుక ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు స్టూడెంట్స్ పెద్దగా సినిమాలకు రారు అనే ఉద్దేశ్యంతో ఫిబ్రవరి లో సినిమాలు ఉండేవి కావు. కాని కరోనా మొత్తం మార్చేసింది. ఫిబ్రవరితో పాటు మార్చిలో కూడా వరుసగా సినిమాలు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కరోనా వల్ల ఏడాదికి పైగా థియేటర్లు పూర్తిగా మూత పడి ఉన్నాయి. కనుక విడుదలకు చాలా సినిమాలు వెయిట్‌ చేస్తున్నాయి. ఆ కారణంగానే ఫిబ్రవరిలో ఆచార్యను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు అదే ఆచార్య నెల అంటే ఫిబ్రవరి నెలలో శర్వానంద్‌ మూవీ కూడా రాబోతుంది.
Tags:    
  • Sharwanand 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS