పొలిటికల్ స్క్రీన్ పై షకీలా కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్‌!

Update: 2021-03-26 16:42 GMT
శృంగార తార‌గా సిల్వ‌ర్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలిగిన ష‌కీలా.. పొలిటిక‌ల్ స్క్రీన్ పై సరికొత్త పాత్రను పోషించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల స‌మ‌రం హోరాహోరీగా సాగుతున్న విష‌యం తెలిసిందే. తన రాజకీయ అరంగేట్రానికి ఇదే మంచి సమయం అని భావించిన షకీలా.. పాలిటిక్స్ లోకి వస్తున్నట్టు ప్రకటించారు.1995లో సినీరంగ ప్రవేశం చేసిన షకీలా.. మొదటి నుంచీ శృంగార తార‌గానే గుర్తింపు పొందారు.  దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీల్లోనూ నటించిన ఈ సెక్స్ బాంబ్.. దాదాపు రెండు వందలకు పైగా చిత్రాల్లో కనిపించారు.

గతేడాది డిసెంబర్ లో షకీలా బయోపిక్ కూడా వచ్చింది. బాలీవుడ్ నటి రిచా చద్దా షకీలా పాత్రలో నటించారు. ఆ సమయంలోనే తన పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని, ప్రజాసేవ చేయడానికి ఏపార్టీ ఆహ్వానించినా వెళ్తానని చెప్పారు.

కాగా.. ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బుధవారమే ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ మానవ హక్కుల విభాగంలో పనిచేయనున్నారు షకీలా. అయితే.. ఎన్నికల వేల రాజకీయాల్లోకి వచ్చిన షకీలా.. పోటీ చేస్తున్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్ప‌టికే పొత్తులు, సీట్ల పంప‌కాలు ముగిసిన నేప‌థ్యంలో ష‌కీలా పోటీ చేస్తారా? లేదా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News