• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  షారుక్ న్యూ మూవీ రైటర్...

షారుక్ న్యూ మూవీ రైటర్ ఎవరో తెలిస్తే షాకే!

By - Tupaki Desk
Update: 2022-04-20 05:02 GMT
బాలీవుడ్ లో ఒక సినిమా చేయడానికి బడ్జెట్  సమస్య ఉండదు. అంటే ఒక సినిమాకి ఎంతో అవసరమైన డబ్బు సమస్య ఉండదు. ఆ లెక్కలన్నీ చూసుకునే రంగంలోకి దిగుతారు. అయితే అక్కడి టైమింగ్స్ వేరు .. వాళ్ల లైఫ్ స్టైల్ వేరు. కంగారుపడిపోతూ .. హడావిడి పెట్టేస్తూ వాళ్లు సినిమాలు చేయరు. ఎవరికి వారు కూల్ గా తమ సినిమాకి సంబంధించిన పనిని పూర్తిచేస్తూ వెళతారు. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో అవకాశాలు సంపాదించుకోవడం .. గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. ఎక్కువగా పరిచయాలే అక్కడ కెరియర్ గ్రాఫ్ ను నిర్దేశిస్తూ ఉంటాయి.

అంతటి భారీ ఇండస్ట్రీలో .. అందునా షారుక్ సినిమాకి మరోసారి పనిచేసే ఛాన్స్ రావడమంటే మాటలు కాదు. ఒక సినిమా సక్సెస్ అయితే మరో సినిమాకి ఛాన్స్ రావడంలో ఎలాంటి విశేషం లేదు. కానీ ఒక భారీ ఫ్లాప్ సినిమాకి పని చేసిన తరువాత, మళ్లీ అదే హీరో సినిమాకి పనిచేసే అవకాశం రావడం మాత్రం విశేషంగానే చెప్పుకోవాలి. ఒక సినిమా ఫ్లాప్ ఆ సినిమా రైటర్స్ పై కూడా భారీగానే పడుతుంది. అలాంటి ప్రభావం నుంచి తప్పించుకుని, తిరిగి పెద్ద సినిమాకి పనిచేయడమనేది చాలా తక్కువమంది విషయంలో మాత్రమే జరిగింది.

అలాంటివారి జాబితాలో బాలీవుడ్ స్క్రీన్ రైటర్ 'కనిక థిల్లాన్' కూడా చేరిపోయింది. షారుక్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ 'డంకీ' అనే సినిమా చేస్తున్నారు. ఇంతకుముందు 'మున్నాభాయ్' .. 'సంజూ' .. 'పీకే' వంటి బ్లాక్ బస్టర్ హిట్లను ఇచ్చిన  రాజ్ కుమార్ హిరానీ, 'డంకీ' సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో కామెడీ .. ఎమోషన్ .. రొమాన్స్ తో పాటు అన్ని రసాలు ఉంటాయని, టైటిల్ ను ఎనౌన్స్ చేసిన రోజునే చెప్పేశారు. ఈ సినిమాకి కనిక థిల్లాన్ రైటర్ గా పనిచేస్తున్నారు. కనిక థిల్లాన్ అనే పేరు టాలీవుడ్ కి బాగా పరిచయమే.

ఆమె కోవెలమూడి ప్రకాశ్ మాజీ భార్య .. రాఘవేంద్రరావు మాజీ కోడలు. ప్రకాశ్ దర్శకత్వంలో అనుష్క ప్రధానమైన పాత్రలో వచ్చిన 'సైజ్ జీరో' సినిమాకి ఆమె పనిచేశారు. ఈ సినిమా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తరువాత వారు విడాకులు తీసుకోవడం జరిగింది. గతంలో షారుక్ హీరోగా చేసిన 'జీరో' సినిమాకి కూడా కనిక పనిచేశారు.

ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయినా మరోసారి షారుక్ సినిమాకి పనిచేసే అవకాశం దక్కడం విశేషంగానే చెప్పుకోవాలి. ఈ సినిమాతోనైనా ఆమెకి హిట్ దొరుకుతుందేమో చూడాలి మరి.
Tags:    
  • Bollywood 
  • starhero 
  • actor 
  • Shahrukh 
  • shahrukhkhan 
  • upcoming 
  • movie 
  • writer 
  • bollywoodfilims 
  • tupakinews 

Similar News

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS