నేను పక్కా ప్రొఫెషనల్ అంటూ ఖాన్ కాకా!
ఆలియా భట్ నిర్మాతగా మారి రూపొందిస్తున్న తన తదుపరి ప్రాజెక్ట్ `డార్లింగ్స్` షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం తన ప్రొడక్షన్ హౌస్ ఎటర్నల్ సన్ షైన్ లో తెరకెక్కుతోంది. నిర్మాతగా తనకు అరంగేట్ర చిత్రమిది. షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి ఆమె ఈ చిత్రాన్ని నిర్మించనుంది. జాస్మీత్ కె రీన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్- షెఫాలి షా- విజయ్ వర్మ- రోషన్ మాథ్యూ తదితరులు నటిస్తున్నారు.
శనివారం అలియా తన సోషల్ మీడియా హ్యాండిల్ లో డార్లింగ్స్ షూట్ ప్రారంభించినందుకు తన ఉత్సాహాన్ని షేర్ చేసింది. ఆమె తన వానిటీ వ్యాన్ నుండి కొన్ని ఫోటోలను పంచుకుంది. అక్కడ ఆమె షూట్ కోసం ప్రిపేర్ అవుతోంది. తన ఆలోచనలను కూడా వెల్లడించింది. నిర్మాతగా ఇది నా తొలి సినిమా అయినా ఎపుడూ నేను నటి అనే చెబుతా.. అదేమిటో తెలియదు ఈ సినిమా విషయంలో నటిగా నెర్వస్ ఫీలవుతున్నా.. రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నానని అన్నారు. కొత్త సినిమా ప్రారంభించే ముందు నెర్వస్ ఫీలవుతానని.. డైలాగ్స్ ఎలా చెబుతానోనన్న భయం ఉంటుందని.. సెట్ కు ఆలస్యంగా వెళతానేమోననే భయంతో 15 నిమిషాలు ముందుగానే షూటింగ్ లొకేషన్ కు చేరుకుంటానని చెప్పుకొచ్చింది. భయం మనలో ఉందంటే చాలా జాగ్రత్తగా ఉంటామని కూడా ఆలియా ట్వీట్ చేశారు
అలియా తాజా పోస్ట్ అనంతరం షారూఖ్ నేరుగా ఒక విజ్ఞప్తి చేశారు. ఈ ప్రొడక్ట్ బయటికి వచ్చాక దయచేసి మీ హోమ్ ప్రొడక్షన్ లో నాకు అవకాశం ఇవ్వండి. నేను షూట్ కి సమయానికి వస్తాను..చాలా ప్రొఫెషనల్ గా ఉంటాను.. ప్రామిస్ చేయండి! `` అంటూ షారూక్ అడిగారు. షారుఖ్ ఖాన్ ట్వీట్ కు ప్రతిస్పందిస్తూ ఆలియా ఇలా రాసింది. ``హాహా.. నేను ఇంకేమీ అడగలేను .. ఒప్పందం కుదుర్చుకున్నాను! లవ్ యు మై ఫేవరేట్`` అని ఆనందం వ్యక్తం చేసింది.
డార్లింగ్స్ ఒక చమత్కారమైన తల్లి-కుమార్తె స్టోరి. ఈ ప్రపంచంలో తమ స్థానాన్ని కనుగొనటానికి తల్లి కూతుళ్లు ప్రయత్నిస్తున్నప్పుడు రకరకాల పరిస్థితులు ఎదువుతుంటాయి. అవేంటో తెరపైనే చూడాలి. ముంబైలో సాంప్రదాయిక దిగువ-మధ్యతరగతి పరిసరాల నేపథ్యంలో డార్క్ కామెడీ కథాంశమిది. అసాధారణమైన పరిస్థితులలో ధైర్యం ప్రేమను కనుగొన్నందున ఈ ఇద్దరు మహిళల జీవితాలు అందరికీ నచ్చేవిగా ఉంటాయిట. ఈ చిత్రం కాన్సెప్ట్ ఒక హెచ్చరికతో వస్తుంది - మహిళలను కించపరచడం మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమనే ఒక రిమైండర్! గా ఉంటుందట.