వెబ్ సిరీస్ లో బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’..
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్ త్వరలో వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడు. అమేజాన్ ప్రైమ్ తో గతంలోనే కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం.. ఇప్పుడు ఇందులో నటించబోతున్నాడు ఈ స్టార్. అయితే.. బిగ్ స్క్రీన్ పై మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నాడు షాహిద్.
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో బాలీవుడ్లో బంపర్ హిట్ కొట్టాడు ఈ కపూర్ వారసుడు. ‘కబీర్ సింగ్’ పేరుతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అతను ఇప్పటి వరకూ నటించిన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ‘కబీర్ సింగ్’ మూవీ. లేటెస్ట్ గా తన నెక్సట్ మూవీ ‘జెర్సీ’ షూటింగ్ పూర్తి చేసాడు షాహిద్. 2021 లో ఈ చిత్రం విడుదల కానుంది.
కాగా.. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించబోయే ‘యోధ’ చిత్రం నుంచి షాహిద్ కపూర్ తప్పుకున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. షూట్ విషయంలో నెలకొన్న అభ్యంతరాాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నుంచి షాహిద్ వైదొలిగినట్లు సమాచారం.
దీంతో.. గతంలో అమెజాన్ ప్రైమ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇప్పుడు ట్రాక్ పైకి తెచ్చాడట. ఈ అగ్రిమెంట్ ప్రకారం షాహిద్ ఓ వెబ్ సిరీస్ లో నటించాల్సి ఉంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ రూపొంచిందించిన బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, డికె.. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఈ వెబ్ సిరీస్ పేరు ‘గవర్’గా నిర్ణయించినట్టు టాక్. మొత్తం రెండు సిరీస్ లలో ఫినిష్ కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, మాలవికా మోహనన్ ప్రధాన పాత్రలు పోషించనున్నట్టు తెలుస్తోంది. జనవరిలో మొదలయ్యే షూట్ నిరంతరాయంగా కొనసాగి ఏప్రిల్ లోపు ముగుస్తాయని సమాచారం. ఈ ‘గవర్’ను ముంబై, గోవాలోనే మొత్తం చిత్రీకరించనున్నట్టు టాక్.