మొక్కై వంగనిది మానై వంగునా? ఖాన్ వారసుడు బాక్సింగ్ మార్షల్ విద్యల ప్రాక్టీస్!
మొక్కై వంగనిది మానై వంగునా? అందుకేనా నటవారసుడికి ఇంతటి కఠోరమైన శిక్షణ? తాజాగా సరోగసీ కిడ్.. కింగ్ ఖాన్ షారూక్ - గౌరీ ఖాన్ ల వారసుడు అబ్రామ్ ఖాన్ లుక్ ఒకటి రకరకాల సందేహాల్ని తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో వెబ్ ప్రపంచంలో పెను ప్రకంపనాలు సృష్టిస్తోంది.
కింగ్ ఖాన్ వారసుడు అబ్రమ్ అచ్చంగా తండ్రి రూపంతోనే జన్మించిన సంగతి తెలిసినదే. ఇప్పుడు అతడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. మైక్ టైసన్ లా మార్షల్ ఆర్ట్స్ వీరుడు కాబోతున్నాడా? అంటే .. ఇదిగో ఇదే ప్రూఫ్. ఇప్పటినుంచే రెడ్ చిల్లీస్ వారసుడు.. నటవారసుడికి తగిన శిక్షణనిస్తున్నారు సదరు సెలబ్రిటీ పేరెంట్. మొక్కై వంగనిది మానై వంగునా? అందుకే ఈ తరహా కఠిన తర్ఫీదు అని భావించాలి.
ఇక బాక్సింగ్ గ్లోవ్స్ లో కొడుకు అబ్రామ్ ఖాన్ అందమైన ఫోటోపై షారూఖ్ ఖాన్ స్పందించాడు. గౌరీతో ప్రస్థావిస్తూ `నేను ఇక్కడ ఉన్నాను?` అని అబ్రామ్ కి దూరంగా ఉన్నానని కలత చెందారు. గౌరీ ఖాన్ ఇటీవల కొడుకు అబ్రామ్ ఖాన్ బాక్సింగ్ గ్లౌజులు ధరించిన ఫోటోను రిలీజ్ చేయగానే ఖాన్ అలా వ్యాఖ్యానించారు. వారసుడిని `మైక్ టైసన్` అని పిలిచాడు షారూక్. అందరు నాన్నల్లాగే ఖాన్ కూడా ఇలాంటి అరుదైన క్షణం మిస్ అవ్వడాన్ని అసహ్యించుకున్నాడు.
మామ్ డాడ్ ఎవరో ఒకరు అబ్రమ్ చేష్టలకు సంబంధించిన ఏ ఫోటోని ఇన్ స్టాలో ట్విట్టర్ లో షేర్ చేసినా అభిమానుల హృదయాలను గెలుస్తాడు. షారూక్ కొడుకు అబ్రామ్ బాక్సింగ్ గ్లోవ్స్ లో ఉన్న గౌరీ పోస్ట్ ను షారుఖ్ తాజాగా రీట్వీట్ చేయగా ఫ్యాన్స్ లో వైరల్ అవుతోంది. ఈ మధురమైన క్షణం తప్పిపోయినందుకు ``అరే యార్ !!! నేను ఎక్కడ ఉన్నాను ???`` అంటూ బాక్సింగ్ గ్లౌజులతో తన కొడుకు ఫోటోను షేర్ చేసి మురిసిపోయాడు.
అబ్రామ్ ప్రస్తుతం కరాటే .. టైక్వాండోలను నేర్చుకుంటున్న ఫోటోల్ని ఇంతకుముందు ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు అబ్రామ్ బాక్సింగ్ ఫోటో అంతే వైరల్ గా మారింది.
ఇంతకుముందే కొన్ని వారాల క్రితం షారుఖ్ - అబ్రామ్ కలిసి సుహానా ఖాన్ ను విమానాశ్రయంలో డ్రాప్ చేసేందుకు వెళ్లిన సంగతి తెలిసినదే.
అప్పుడు కన్వర్టిబుల్ ఎర్ర కారులో అబ్రామ్‌తో కలిసి కింగ్ ఖాన్ ఫోటోలు ఇంటర్నెట్ లోకి వచ్చాయి.
కెరీర్ సంగతి చూస్తే.. షారూఖ్ పఠాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనే- జాన్ అబ్రహం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.