• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఏదేమైనా.. షారుఖ్...

ఏదేమైనా.. షారుఖ్ మాట్లాడేదే లే

By - Tupaki Desk
Update: 2021-10-26 03:41 GMT
షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ డ్రగ్స్‌ కేసులో అరెస్టై చాలా రోజులయ్యింది. దీనిపై ఇండస్ట్రీ అంతా రియాక్టయ్యింది. కానీ ఇంతవరకు షారుఖ్ మాత్రం రియాక్ట్ అవ్వలేదు. షూటింగులు ఆపేశాడు. ఇంట్లోనే ఉంటున్నాడు. బెయిల్ దొరుకుతుందేమోనని కోర్టు బయట కొడుకు కోసం రెండుసార్లు ఎదురు చూశాడు. కానీ అలా జరగలేదు. అయినా షారుఖ్ పెదవి మెదపలేదు. అతనెప్పుడు నోరు విప్పుతాడా, కొడుకు గురించి ఏం మాట్లాడతాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అసలు షారుఖ్ ఈ విషయంపై మాట్లాడటం జరగనే జరగదు అంటున్నారు అతని సన్నిహితులు.

రోజూ షారుఖ్ ఇంటి ముందు చాలామంది గుమిగూడుతున్నారు. ఆర్యన్‌కి ఏమీ కాదు, ధైర్యంగా ఉండమంటూ ప్లకార్డ్స్ ద్వారా తమ అభిమాన హీరోకి ధైర్యం చెబుతున్నారు. మరోవైపు ఇండస్ట్రీ నుంచి పలువురు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఆర్యన్‌ని విడిపించడానికి సల్మాన్ లాంటివాళ్లు సాయపడుతున్నారు. కానీ ఆర్యన్‌ చుట్టూ అంతకంతకీ ఉచ్చు బిగుసుకుంటోందే తప్ప తను బైటికి రావడం లేదు. దాంతో ఇప్పటికైనా షారుఖ్ మౌనాన్ని వీడి అందరి ముందుకీ వస్తే మంచిదని, అంత పెద్ద స్టార్‌‌ ఎంత బాధపడుతున్నాడో చూస్తే కొంత ఫలితం ఉండొచ్చని కొందరు సలహా ఇచ్చారు. దాంతో కింగ్ ఖాన్ సన్నిహితులు రియాక్టయ్యారు.

షారుఖ్‌ ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ఎవరినీ బతిమాలుకోవాల్సిన అవసరం కూడా లేదని వాళ్లు అంటున్నారు. జరిగేవన్నీ తను అన్నీ ఫాలో అవుతున్నాడని, కానీ ఏది ఏమైనా అతను నోరు మాత్రం మెదపడని తేల్చేశారు. అంతేకాదు.. కొడుకు బైటికి వచ్చాక తనని ఏం చేయాలనేది కూడా షారుఖ్ ఆలోచించాడట. కొన్నాళ్ల పాటు ఆర్యన్‌ని హౌస్ అరెస్ట్ చేస్తాడట. ఆ తర్వాత కూడా తిరుగుళ్లు, లేట్ నైట్ పార్టీలు లేకుండా రిస్ట్రిక్ట్ చేస్తాడట. ఇకపై పిల్లలతో చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలని షారుఖ్ డిసైడ్ చేసుకున్నాడని వాళ్లు అంటున్నారు.

ఇవన్నీ వింటుంటే కొడుకు ఇలా అవ్వడానికి తాను ఎక్కువ ఫ్రీడమ్‌ ఇవ్వడమే కారణమని షారుఖ్ ఫీలవుతున్నట్టున్నాడనిపిస్తోంది. బహుశా నిజానికి అతను తన పిల్లలకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ స్వేచ్ఛనిచ్చాడని గతంలో కూడా కొందరు కామెంట్ చేశారు. ఇప్పుడు దాన్ని తాను కూడా రియలైజ్ అవుతున్నాడని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారంతా.


Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 
  • ShahRukhKhan 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS