‘పెళ్లి సందD’ మొదలైంది

Update: 2020-12-19 10:30 GMT
శ్రీకాంత్‌ హీరోగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో దాదాపు పాతిక సంవత్సరాల క్రితం వచ్చిన పెళ్లిసందడి మూవీ సెన్షేషనల్‌ సక్సెస్‌ అయిన విషయం తెల్సిందే. ఇప్పుడు అదే టైటిల్ తో రాఘవేంద్రరావు సినిమాను ప్రకటించడంతో అంతా కూడా ఆ సినిమాకు సీక్వెల్‌ లేదంటే రీమేక్ అంటూ అప్పుడే అంచనాలు పెంచేసుకున్నారు. కొత్త ‘పెళ్లి సందD’ లో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ నటించడం వల్ల ఆసక్తి మరింత ఎక్కువ అవుతుంది. ఈ సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించకుండా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. గౌరి రోనక్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

నేడు ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. షూటింగ్‌ మొదటి షెడ్యూల్ లో రోషన్‌ తో పాటు ముఖ్య తారాగనం పాల్గొంటున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ లేదు. ‘పెళ్లి సందD’ షూటింగ్ ప్రారంభం అయిన నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రథమార్థం చివరి వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న ఈ సినిమాకు పాటలను కీరవాణి అందిస్తున్నారు. అప్పట్లో పెళ్లి సందడికి కూడా కీరవాణి సంగీతం అందించారు. పాతికేళ్ల తర్వాత వస్తున్న ఈ ‘పెళ్లి సందD’ కి కూడా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.
Tags:    

Similar News