• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలీవుడ్ కి రీమేక్ నామ...

బాలీవుడ్ కి రీమేక్ నామ సంవత్సరమే

By - Tupaki Desk
Update: 2017-01-08 01:30 GMT
టాలీవుడ్ లో అంటే సీక్వెల్స్ కల్చర్ అంతగా లేదు. సీక్వెల్స్ ఆడవు అనే సెంటిమెంట్ కారణంగా ఇక్కడ పెద్దగా ధైర్యం చేయరు కానీ.. బాలీవుడ్ ఈ ట్రెండ్ ఎప్పటినుంచో నడుస్తోంది. ప్రతీ ఏడాది సీక్వెల్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం సీక్వెల్స్ ట్రెండ్ పీక్ స్టేజ్ కి వెళ్లిపోతోంది. ఏకంగా 10 సినిమాలకు సీక్వెల్స్ 2017లో బాలీవుడ్ లో రిలీజ్ కానున్నాయి.

ఈ ఏడాదికి ఎక్కువగా ఎదురుచూస్తున్న మూవీగా బాహుబలి2కి బాలీవుడ్ ప్రేక్షకులు ఓటేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28న బాహుబలి ది కంక్లూజన్ థియేటర్లలోకి రానుంది. రోబో చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన రజినీకాంత్ మూవీ 2.0..  ఈఏడాది దీపావళికి విడుదల కానుంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ మూవీ ఏక్ థా టైగర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న టైగర్ జిందాహై చిత్రం 2017 క్రిస్మక్ కానుకగా డిసెంబర్ 21న విడుదలవుతోంది. జాలీ ఎల్ ఎల్‌ బీ2.. ఈ ఏడాదికి గాను రిలీజ్ కానున్న మొట్టమొదటి సీక్వెల్. ఫిబ్రవరి 10న ఈ అక్షయ్ కుమార్ మూవీ థియేటర్లలోకి వస్తోంది.

గోల్ మాల్ సిరీస్ తో వరుస హిట్స్ కొడుతూ చివరగా గోల్ మాల్3తో వంద కోట్లు కొల్లగొట్టేసిన అజయ్ దేవగన్.. ఈఏడాది గోల్ మాల్ అగైన్ అంటూ రానున్నాడు. ఇంకా రిలీజ్ డేట్ చెప్పలేదు కానీ.. ఈ చిత్రం కూడా ఇదే ఏడాది రానుంది. నాగార్జున మూవీ హలోబ్రదర్ ను హిందీలో జుడ్వా అని రీమేక్ చేస్తే.. ఇప్పుడదే చిత్రానికి సీక్వెల్ జుడ్వా2ను వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 19న ఈ మూవీ విడుదల కానుంది. బాలీవుడ్ లో ఇరగదీసేస్తున్న తాప్సీ పన్ను.. నామ్ షబానా అంటూ బేబీ చిత్రానికి ప్రీక్వెల్ చేసేస్తోంది. దీని రిలీజ్ డేట్ మార్చ్ 31.

సర్కార్.. సర్కార్ రాజ్ అంటూ సంచలనాలు సృష్టించిన అమితాబ్-వర్మ కాంబో.. మార్చ్17న సర్కార్ 3 అంటూ థియేటర్లలోకి వచ్చేస్తున్నారు. అడల్ట్ కామెడీ జోనర్ లో సిరీస్ గా తెరకెక్కుతున్న హేట్  స్టోరీ4.. అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. విద్యుత్ జమాల్ ను యాక్షన్ హీరోగా చూపించిన కమాండో మూవీకి సీక్వెల్ గా కమాండో2 వచ్చేస్తోంది. మార్చ్ 3న ఈ మూవీ రిలీజ్ కానుంది. మొత్తం మీద.. ఈ ఏడాది బాలీవుడ్ కి సీక్వెల్ నామ సంవత్సరం అని నామకరణం చేసేయచ్చు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sequel Movies 
  • Bollywood 
  • 2017 

Similar News

సౌందర్య నాకు గట్టి పోటీ ఇచ్చింది.. రమ్యకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-19 06:00 GMT

ప్రిన్స్ విలియం ముందు సైఫ్ అలీఖాన్ బోల్డ్ కామెంట్స్!

2026-11-19 05:36 GMT

కళ్ళుచెదిరే అందాలతో కియారా.. క్యూట్ లుక్ తో ఆకట్టుకుంటున్న కూతురు!

2026-11-19 05:32 GMT

'ధురంధర్ 2' డే 14 కలెక్షన్లను దాటేసిన రామాయణం!

2026-11-19 05:08 GMT

ట్రెండింగ్: స‌మంత త‌ర్వాత జెన్-Z లేడీ బాస్?

2026-11-19 05:01 GMT

8 కిలోల గజ్జెలతో శ్రద్ధా కపూర్ సాహ‌సం.. లావణి నృత్యం అంత క‌ష్ట‌మా?

2026-11-19 05:01 GMT

ఖ‌రీదైన ప‌చ్చ‌ల హారంతో మ‌హారాణినే త‌ల‌పించింది!

2026-11-19 05:01 GMT

టైసన్ నాయుడు టీజర్.. ఓల్డ్ సిటీలో ఇన్వెస్టిగేషన్ ట్విస్ట్

2026-11-19 04:56 GMT

'ఆకాశంలో ఒక తార' USA థియేటర్స్ లిస్ట్

2026-11-19 04:05 GMT

ఓటీటీలో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ'.. అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన!

2026-11-19 03:47 GMT

'ఈఎన్ఈ రిపీట్' మూవీ రివ్యూ

2026-11-19 03:30 GMT

మన సంస్కృతిని వాళ్ల దగ్గర తక్కువ చేసి మాట్లాడను.. రాధికా ఆప్టే వ్యాఖ్యలపై కీర్తి సురేష్ స్ట్రాంగ్ కౌంటర్!

2026-11-19 03:13 GMT

Copyright @2026

Powered by Blink CMS