స్టార్ హీరోపై కాంట్రవర్సీ క్వీన్ సంచలన కామెంట్స్..!

Update: 2021-06-07 17:30 GMT
బాలీవుడ్ బ్యూటీ యామిగౌతమ్.. డైరెక్టర్ ఆదిత్యను పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. పెళ్లి విషయంతో పాటు పెళ్లి తర్వాత విషయాలను కూడా యామి సోషల్ మీడియానే ఎంచుకుంది. అందుకే వరుసగా పెళ్లికి ముందు ఫోటోలు కూడా పోస్ట్ చేసింది. యామి గౌతమ్ వివాహం హిమాచల్ ప్రదేశ్ లోని తన స్వగ్రామంలో జరిగింది. 'ఉరి ది సర్జికల్ స్ట్రైక్' మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు డైరెక్టర్ ఆదిత్యధర్. డెబ్యూ మూవీతోనే ఆదిత్య ఇండస్ట్రీ పరంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆ సినిమాలో హీరోయిన్ యామిగౌతమ్ కూడా ఓ కీలక రోల్ ప్లే చేసింది. ఆ సినిమా టైంలోనే వీరిద్దరూ స్నేహితులుగా మారి ప్రేమ చిగురించి.. ఇటీవలే ఏకంగా పెళ్లి చేసేసుకుని సర్ప్రైజ్ చేశారు.

తన పెళ్లి విషయాన్నీ యామి గౌతమ్ స్వయంగా సోషల్ మీడియాలో ఫోటో పెట్టి పోస్ట్ చేసింది. అలాగే కోవిడ్ నిబంధనల మేరకు తాము కేవలం ఫ్యామిలీ - సన్నిహితుల సమక్షంలో మాత్రమే ఎలాంటి ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకొని మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టాము. మీరందరి బ్లెస్సింగ్స్ కావాలంటూ పోస్ట్ చేసింది. అలాగే ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరి పెళ్లి పహాది ఆచారంలో నాథ్ని - కలీరీన్ వంటి భారీ సాంప్రదాయ ఆభరణాలతో అలంకరణ చేసుకున్న యామి ఫోటోను చూడవచ్చు. ఎర్రచీరలో యామి పెళ్లికూతురు లుక్ క్లాసిక్ అనే చెప్పాలి.

అయితే సహానటి వివాహంతో పలువురు సెలబ్రిటీలతో హీరో ఆయుష్మాన్ ఖురానా 'సింపుల్ రియల్ గాడ్ బ్లెస్స్' అని కామెంట్ చేసాడు. అలాగే యాక్టర్ విక్రాంత్ మాస్సే కూడా 'రాధేమా'లా ఉన్నావంటూ కామెంట్ చేసాడు. ఆ వెంటనే ఆయుష్మాన్ - విక్రాంత్ కామెంట్స్ చూసి బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ సంచలన కౌంటర్స్ చేసింది. సింపుల్ అన్నందుకు ఆయుష్మాన్ కు - అటు రాధేమాలా ఉన్నావ్ అన్నందుకు విక్రాంత్ లకు తన పద్ధతిలో కౌంటర్స్ వేసింది. ఈ కామెంట్స్ లో సింపుల్ అని చెప్పడం ఎంత కష్టమో తెలుసా అని ఆయుష్మాన్ కామెంట్ కు రిప్లై ఇచ్చింది. కానీ విక్రాంత్ ను మాత్రం కంగనా బొద్దింకతో పోల్చడం చర్చనీయంశం అయింది. ప్రస్తుతం కంగనా కామెంట్స్ సోషల్ మీడియాలో.. బాలీవుడ్ వర్గాలలో హాట్ టాపిక్ అయింది.
Tags:    

Similar News