• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'హీరోయిన్లు ఆఫర్స్ కోసం...

'హీరోయిన్లు ఆఫర్స్ కోసం పడుకోవాల్సిందే'.. సీనియర్ దర్శకుడి సంచలన వ్యాఖ్యలు..!

By - Tupaki Desk
Update: 2022-05-23 10:38 GMT
సినిమా అనే రంగుల ప్రపంచంలో తెర పైన కనిపించే విషయాలకంటే.. తెర వెనుక జరిగేవే ఎక్కువని అంటుంటారు. సినీ ఇండస్ట్రీ అనేది ఒక లోతైన సముద్రమని.. చాలా విషయాలు గుర్తించబడవని చెప్పుకుంటుంటారు. ముఖ్యంగా మహిళలు ఇక్కడ క్యాస్టింగ్ కౌచ్ వంటివి ఎదుర్కొంటారని పలువురు అభిప్రాయ పడుతుంటారు.

గతంలో 'క్యాస్టింగ్ కౌచ్' 'మీటూ' ఉద్యమాలు చిత్ర పరిశ్రమను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ - వేధింపులు సర్వసాధారణమంటూ అనేక మంది హీరోయిన్లు తమ అభిప్రాయాలను బహిరంగంగానే వ్యక్తపరిచారు. కొందరైతే ధైర్యంగా వాళ్ళ పేర్లను వెల్లడించి సంచలనం రేపారు. టాలీవుడ్ లో కూడా దీనిపై పెద్ద చర్చ జరిగింది.

ఈ నేపథ్యంలో చాలా మంది హీరోయిన్లు సినిమా ఆఫర్ల కోసం పడుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ దర్శకురాలు గీతాకృష్ణ. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ ఉన్నట్లే.. హానీ ట్రాప్ కూడా ఉందని అన్నారు.

ఇండస్ట్రీలో అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటని ప్రశ్నించగా.. ''ఏమీ తేడా లేదు. ఇండస్ట్రీలో అప్పుడూ అమ్మాయిలు పడుకునేవారు.. ఇప్పుడు కూడా పడుకుంటున్నారు. పడుకోవాలి. అప్పుడూ మోసం చేసేవాళ్ళు.. ఇప్పుడు కూడా చేస్తున్నారు. సినిమా చూసే జనాల యాటిట్యూడ్ మాత్రమే ఇక్కడ మారింది'' అని బోల్డ్ గా మాట్లాడారు గీతాకృష్ణ.

''నువ్వు కమిట్మెంట్ ఇచ్చి వచ్చావ్ అని అంటే ఏ హీరోయిన్ అయినా ఒప్పుకుంటుందా? ఎవరూ ఒప్పుకోరు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉంది.. ఉండబోతోంది.. రాబోయే రోజుల్లో ఇంకా బాగా పెరుగుతుంది'' అని అన్నారు. ''సెక్సువల్ కాంటాక్ట్ లో ఫేవర్ చేయడం అనేది అడ్వర్టైజింగ్ లో పుట్టింది. సౌత్ ఇండియాలో ఫస్ట్ క్యాస్టింగ్ కౌచ్ అనేది కోలీవుడ్ లో పుట్టింది. నాస్టీ ఫెలోస్ వాళ్ళు. కన్నడ వాళ్ళు ఇంకా డర్టీ ఫెలోస్'' అని దర్శకుడు అన్నారు.

''ఒక ఆడదాన్ని చూశారంటే 90 శాతం మగవాళ్ళు పడుకోవాలనే అనుకుంటారు. ఆడది కూడా హానీ ట్రాప్. వీళ్ళు కూడా సామాన్యమైన వాళ్ళు కాదు. వాడి దగ్గర ఎంత డబ్బు ఉంది.. ఎలా వాడిని లొంగదీసుకుందాం.. ఎలా డబ్బులు గుంజుదాం అని ఆలోచిస్తుంటారు. దాన్నే హానీ ట్రాప్ అంటారు. వాళ్ళు కాస్టింగ్ కౌచ్ చేస్తే.. వీళ్ళు హానీ ట్రాప్ చేస్తారు. ఈ రెండూ ఎప్పుడూ ఉంటాయి'' అని గీతా కృష్ణ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

''డైరెక్టర్స్ లోనే కాదు క్యాస్టింగ్ కౌచ్ అనేది మ్యూజిక్ డైరెక్టర్స్ లో కూడా ఉంది. అందమైన సింగర్స్ తమతో పడుకోవాలని సంగీత దర్శకులు కోరుకుంటారు'' అని తెలిపారు. ''అలాంటివి ధైర్యంగా బయటపడితే ఆ అమ్మాయి పరువే పోతుంది. తర్వాత ఎవరూ ఆఫర్స్ ఇవ్వరు. ఇవన్నీ ఇండస్ట్రీలో మామూలే''

''నేను అందరినీ అనడం లేదు. అలాంటివి తన లైఫ్ లో వద్దు అనుకునే హీరో హీరోయిన్లు కూడా ఉంటారు. వాళ్ళు 10-15 శాతం ఉంటారు. అందుకే అందరినీ ఓకేలాగా చూడలేం. కానీ క్యాస్టింగ్ కౌచ్ ఉందా అంటే మాత్రం గతంలోనూ ఉంది.. ఇప్పుడు ఉంది.. భవిష్యత్ లో కూడా ఉంటుంది అని చెప్తాను'' అని సీనియర్ డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా గతంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి చెబుతూ.. రేణూ దేశాయ్ చాలా పర్ఫెక్ట్ గర్ల్ అని గీతాకృష్ణ పేర్కొన్నారు. ''ప్రభుదేవా హీరోగా చేసిన 'టైమ్' సినిమాలో హీరోయిన్ కోసం ముంబైలో ఆడిషన్స్ చేసాం.. దానికి 20 మంది అమ్మాయిలను ఫోటోలు తీసాం. అయితే నేను రేణూ దేశాయ్ ఫోటోని ఎంపిక చేసాను. 'ఆ అమ్మాయి ఎందుకు? మీరు చెప్పిన మాట వినదు' అని కోఆర్డినేటర్స్ చెప్పారు. అలా ఎందుకు అన్నారో నాకు అసలు అర్థం కాలేదు''

''ఫోటో వెనకున్న నంబర్ తో రేణూ దేశాయ్ కి ఫోన్ చేస్తే హోటల్ కు వచ్చి కలిసింది. 'ఏంటి ఇక్కడ నీ గురించి ఇలా అంటున్నారు.. నీకేమైనా యటిట్యూడా?' అని అడిగాను. 'అదేం లేదండీ.. ఇక్కడ వీరంతా ఇలానే ఉంటారు. డర్టీ ఫెలోస్. నేను కమిట్మెంట్స్ కు దూరంగా ఉంటాను కాబట్టి.. నన్ను సపోర్ట్ చేయరు' అని చెప్పింది. వెంటనే నువ్వే నా సినిమాలో హీరోయిన్ అన్నాను. చివరకు సిమ్రాన్ ను హీరోయిన్ గా తీసుకోవాల్సి వచ్చింది. నిజంగా ఆరోజు రేణూ దేశాయ్ చెప్తే కానీ నాకు కమిట్మెంట్ అంటే ఏంటో తెలియలేదు. ఇది 1999లో జరిగిన విషయం'' అని గీతా కృష్ణ తెలిపారు.

కాగా, సంకీర్తన - కీచురాళ్లు - కోకిల వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు గీతాకృష్ణ. అయితే ఇప్పుడు ఔట్ డేటెడ్ అయిపోయారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో హీరోలు మరియు వారి విగ్గులు.. హీరోయిన్ల సంబంధాలు.. హీరోహీరోయిన్ల క్యారెక్టర్లపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.
Tags:    
  • geethakrishna 
  • stardirector 
  • sensational 
  • comments 
  • heroines 
  • tupakinews 
  • latestnews 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS