పవన్.. మహేష్‌.. ఎలా చేస్తారు గురూ!!

Update: 2017-08-10 08:15 GMT
శేఖర్ కమ్ములపై మన తెలుగు ప్రేక్షకులుకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. పర్వాలేదు ఇతను మంచి కథలే తీస్తాడు మనకు దగ్గరగా ఉన్న అనుబంధాలుతో ముడిపడిన విషయాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు అని భావిస్తూ ఉంటారు. అతని మొదటి సినిమా నుండి ఇప్పటి ‘ఫిదా’ సినిమా వరకు అన్నీ అటువంటి కథే చెప్పడానికి ప్రయత్నం చేశాడు కొన్ని హిట్ అయ్యాయి కొన్ని ఘోర పరాజయం చెందాయి. ఎందుకు జరిగాయో మనకు తెలుసు తీసిన అతనికి కూడా తెలిసే ఉంటుంది.

అయితే ఈ మధ్య తన ఫిదా సినిమా హిట్ అవ్వడంతో అతనుపై అందరూ మళ్ళీ ఫోకస్ పెట్టారు. హిట్ అయింది కాబట్టి ఫోకస్ పెట్టారు బాగానే ఉంది కానీ కొన్ని మీడియా ఇంటర్వ్యూ లో ఈ కథ కోసం ముందు మహేశ్ బాబు నీ అనుకున్న పవన్ కల్యాణ్ తో తీద్దాం అనుకున్న అని చెప్పుకు వస్తున్నాడు శేఖర్ కమ్ముల. అతను ఎంచుకున్న సినిమాలకు అతను చెబుతున్న స్టార్ పేర్లకు ఎక్కడైనా పోలిక ఉందా అసలు అనిపిస్తుంది వినేవాళ్ళకి. అంటే ఇలా చిన్న కథలు పెద్ద స్టార్లు చేయలేరా అని కాదు ఇక్కడ అర్ధం, సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చిన తరువాత ఆ హీరో నుండి కోరుకునే సినిమాలు కానీ అతను వలన జరిగే మార్కెట్ కానీ వేరే స్థాయిలో ఉంటాయి. అవి ఏవి శేఖర్ కథలో ఉండవు. మన జీవితంలో జరిగే చిన్న విషయాలను సున్నితంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు శేఖర్. అతను చెప్పినట్లు మహేశ్ బాబు కానీ పవన్ కల్యాణ్ కానీ ఈ సినిమా చేసి ఉంటే వేరే అలా ఉండేది అని అతను ఎలా అనుకుంటున్నాడో ఎవరికి అర్ధం కాలేదు.

పవన్ కల్యాణ్ కూడా ఒక సినిమాలో  హీరోయిన్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టినది ఉంది అదే తొలి ప్రేమ. ఆ సినిమా చేస్తున్నప్పుడు పవన్ స్థాయి వేరు ఇప్పుడు పవన్ కల్యాణ్ స్థాయి వేరు. కొన్ని ప్రేమకథలకు హీరో అనే ఇమేజ్ దాటి తారాస్థాయి అభిమానం సంపాదించిన హీరోలు ఫిట్ అవ్వరు అనే చెప్పాలి. మరి ఇంత అనుభవం ఉన్న శేఖర్ వాళ్ళని ఊహించుకునే ఈ కథను రాశాను ఇది వాళ్ళు చేసి ఉంటే సూపర్ హిట్ అయినా అవ్వవచ్చు అనుకోవడం భ్రమే.  మహేశ్ బాబుకి ఈ కథ చెప్పాను కానీ ఎందుకో వర్క్ ఔట్ కాలేదు ఒక ఇంటర్వ్యూ లో కూడా అన్నాడు. వాళ్ళు ఎందుకు ఈ సినిమాను కాదు అనుకున్నారో ఇప్పటికీ అర్ధమైనట్లు లేదు మనోడికి. పెద్ద స్టార్లు తో చేసి తన కథతో  మరింత హిట్ కొట్టాలి అని ఉండటంలో తప్పులేదు కానీ ఇలా వీదిలో ప్రేమ కథలను కాలేజీ క్యాంపస్ లో ప్రేమ కథను రాసి నాకు పవన్ కల్యాణ్ కావాలి మహేశ్ బాబు కావాలి అంటే ఎలా కుదురుతుంది చెప్పండి.

సూపర్ స్టార్లు  ఒక కథను ఎంచుకున్నారు అంటే అది కేవలం ఒక కథే అయి ఉండదు. ఆ హీరో నిర్ణయం పై ఇండస్ట్రి - కోట్ల బిజినెస్ - కోట్లమంది అభిమానాలు ఆశలు ఉంటాయి. అవి అన్నీ దృష్టిలో పెట్టుకొని సినిమా కథ రాస్తే శేఖర్ కూడా అతను అనుకున్న హీరోలు తో సినిమా తీసే రోజు దగ్గరలో ఉండవచ్చు. 
Tags:    

Similar News