• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: పోకహంటాస్...

ఫోటో స్టొరీ: పోకహంటాస్ ప్రిన్సెస్ లా..

By - Tupaki Desk
Update: 2019-08-24 08:50 GMT
సీరత్ కపూర్ తెలుసు కదా? 'రన్ రాజా రన్' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై భామ తెలుగులో దాదాపు అరడజను సినిమాల్లో నటించింది. ఆ అరడజనులో 'రాజుగారి గది 2'.. 'ఒక్క క్షణం'.. 'టచ్ చేసి చూడు' సినిమాలు ఉన్నాయి.  అయితే ఈ సినిమాలన్నీనిరాశ పరచడంతో సీరత్ కెరీర్ స్లో అయింది.  సినిమాలు ఫ్లాప్ కావడం.. అవకాశాలు తగ్గడం లాంటివి జరిగితే సాధారణ హీరోయిన్లు దిగాలు పడి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారేమో కానీ సీరత్ ఆ టైపు భామ కాదు.  సోషల్ మీడియాలో మంటలు పెట్టే కార్యక్రమంపై ఫోకస్ చేసింది.

రీసెంట్ గా ఈ భామ ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది.  బాలీవుడ్ లో ఉన్న అందాల అతివలు.. ఘాటు బ్యూటీలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో సీరత్ కూడా ఒక ఫ్యాషనబుల్ డ్రెస్ ధరించి హొయలుపోతూ ర్యాంప్ వాక్ చేసింది.  దాంతో పాటుగా వయ్యారం ఒలికిస్తూ కెమెరాలకు పోజులిచ్చింది.  ఆ ఫోటోల నుండి కొన్ని హాటు ఫోటోలను ఎంపిక చేసి తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలకు "పోకహంటాస్ ఫీల్స్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  డిస్నీ వారి పాపులర్ కార్టూన్ క్యారెక్టర్స్ లో పోకహంటాస్ ప్రిన్సెస్ ఒకరు.  ఈ లాక్మే ఫ్యాషన్ వీక్ లో ఆ యువరాణిలా ఫీల్ అయిందట!

ఇక ఫోటో విషయానికి వస్తే లైట్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ లో తళుక్కున మెరిసింది. చెంపలపై అటూ ఇటూ పడుతున్న వెరైటీ హెయిర్ స్టైల్.. పర్ఫెక్ట్ మేకప్ తో మోడరన్ గా కనిపిస్తూ సూపర్ పోజులిచ్చింది.  యాక్సెసరీస్ ఏమీ ధరించలేదు కానీ బ్రౌన్ కలర్ మ్యాచింగ్ ఫుట్ వేర్ ధరించింది.  స్మైల్ సంగతి చెప్పనవసరం లేదు.. నెటిజన్లను మెస్మరైజ్ చేసేలా నవ్వుతోంది.  ఈ ఫోటోలకు రెస్పాన్స్ సూపర్ గా ఉంది.  "ది ప్రెట్టి ప్రిన్సెస్".. "క్యూట్ డాల్".. "లవ్లీ ఏంజెల్" అంటూ కామెంట్స్ పెట్టారు.  సీరత్ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. 
Tags:    
  • Seerat Kapoor 
  • Lakme Fashion Week 2019 
  • LFW 2019 
  • Actress Seerat Kapoor 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS