లేడీ 'ఐకాన్' కోసం వెతుకులాట

Update: 2021-08-17 00:30 GMT
ఐకానిక్ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా ప్రస్తుతం రూపొందుతున్న పుష్ప సినిమా మొదటి పార్ట్‌ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సెప్టెంబర్‌ లో పుష్ప 1 కు గుమ్మడి కాయ కొట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇక వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఐకాన్ సినిమాను బన్నీ చేయాల్సి ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే అక్టోబర్ లేదా నవంబర్‌ లో ఐకాన్ కు క్లాప్ పడే అవకాశం ఉందని అంటున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్న బన్నీ ఐకాన్‌ సినిమాను కేవలం నాలుగు అయిదు నెలల్లోనే పూర్తి చేయాలని ఇప్పటికే దర్శకుడు మరియు నిర్మాతకు చెప్పడం జరిగిందట. దాంతో ఐకాన్‌ ప్రీ ప్రొడక్షన్ వర్క్ షరవేగంగా జరుగుతోంది.

చాలా కాలం క్రితమే ఐకాన్ ప్రాజెక్ట్‌ ఓకే అయ్యింది. కాని కరోనా ఇతరత్ర కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు ఐకాన్‌ ను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నారు. వచ్చే ఏడాది లో ఐకాన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు గాను బాలీవుడ్‌ మోస్ట్‌ ఫేమస్ గర్ల్‌ ను తీసుకుంటారని తెలుస్తోంది. శ్రద్దా కపూర్ మొదలుకుని అనన్య పాండే వరకు పలువురు హీరోయిన్స్ పేర్లను ఐకాన్ కోసం పరిశీలిస్తున్నారు. ఇప్పటికే బన్నీతో సౌత్‌ స్టార్‌ హీరోయిన్స్ అంతా కూడా దాదాపుగా నటించేశారు. కనుక ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ ను నటింపజేస్తే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారట.

అల్లు అర్జున్ మరియు బాలీవుడ్‌ హీరోయిన్ నటిస్తే ఖచ్చితంగా ఐకాన్ సినిమా భారీ పాన్‌ ఇండియా మూవీగా నిలిచే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. పుష్ప సినిమా తో ఖచ్చితంగా బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈ సినిమా తో ఆయన మరింతగా స్టార్‌ డమ్‌ ను దక్కించుకునేలా వేణు శ్రీరామ్‌ ప్లాన్‌ చేస్తున్నాడని సమాచారం అందుతోంది. ఐకాన్ సినిమా చాలా ప్రత్యేకంగా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుందట.

వకీల్ సాబ్ ను కమర్షియల్‌ సక్సెస్ చేసిన వేణు శ్రీరామ్‌ ఐకాన్ ను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేయబోతున్నాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్‌ కు మంచి డిమాండ్ ఉంది. ఐకాన్ ను సక్సెస్ చేస్తే ఖచ్చితంగా ఆయన స్టార్‌ డమ్‌ అమాంతం పెరిగి పోతుంది. ఐకాన్ ను పాన్ ఇండియా మూవీగా నిలిపేందుకు గాను హీరోయిన్ విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాన్ని తీసుకోవాలని దిల్‌ రాజు కూడా భావిస్తున్నాడట. షూటింగ్‌ ప్రారంభం అయ్యే సమయానికి హీరోయిన్‌ ఎంపిక విషయంలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Tags:    

Similar News