ట్రైలర్ టాక్: ఒక్క నైట్ స్టే చేయాలి! 25 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల పెళ్లాం!

Update: 2021-09-19 09:28 GMT
తెలుగు సినిమాలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఒకే మూసలో సాగిన సినిమాలకు భిన్నంగా ఇప్పుడు కొత్త తరహా కథలు వస్తున్నాయి. యూత్ డైరెక్టర్లు ఇండస్ట్రీలోకి రావటం.. సినిమా మీద ఉన్న ఆసక్తితో వస్తున్న నిర్మాతల పుణ్యమా అని.. రోటీన్ కు భిన్నమైన కథలు వస్తున్నాయి. ఇందులోకొన్ని ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటుంటే.. మరికొన్ని ఇదేం పాడు బుద్ధి అంటూ తిట్టు తినేస్తున్న పరిస్థితి. మొత్తంగా.. ఎవరికి వారు తమదైన రీతిలో ప్రయోగాలు చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో కొన్నికథలు అనూహ్యంగా ఉండి అందరి కంట్లో పడటమే కాదు.. విపరీతంగా వైరల్ అవుతూ.. సదరు చిన్న సినిమా కాస్తా పెద్ద చర్చకు తెర తీస్తుంది.

ఇప్పుడు ఆ కోవలోకే వస్తుంది తాజాగా ట్రైలర్ విడుదలైన సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి మూవీ. ఈ బడ్జెట్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన రోజులోనే ఏకంగా 11.61 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకోవటమే కాదు.. పక్కా ఎంటర్ టైన్మెంట్ మూవీగా ముద్ర వేసేలా ట్రైలర్ ను కట్ చేశారు. 2.12 నిమిషాల వ్యవధి ఉన్న ట్రైలర్ లోనే కామెడీని.. ఆసక్తిని రేకెత్తించే కథనాన్ని.. రోటీన్ మూవీలకు భిన్నమైన స్టోరీ నేరేషన్ ఉందన్న భావనను కలిగేలా చేయటంలో సక్సెస్ అయ్యారు.

తన భర్త సత్యమూర్తి తప్పిపోయాడని 60 ఏళ్ల సావిత్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వటం.. ఫోటోగా పాతికేళ్ల కుర్రాడి ఫోటోను ఇవ్వటంతో షాక్ తిన్న పోలీసు అధికారి సీన్ తో మొదలైన ట్రైలర్.. ఏ దశలోనూ తగ్గకుండా పోవటమే కాదు.. సినిమా మీద క్యూరియాసిటీ పెంచేలా చేస్తుంది. కేరింత ఫేమ్ పార్వతీశం లీడ్ క్యారెక్టర్ చేస్తే.. పాతికేళ్ల భర్తకు అరవై ఏళ్ల భార్యగా సీనియర్ హాస్యనటి శ్రీలక్ష్మి నటించారు. ఈ ఇద్దరూ భార్యభర్తలుగా కనిపించనున్నారు. కామెడీ ప్రధానాంశంగా రాబోతున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

హీరో ఏజ్ రహస్యం విలువ రూ.50 కోట్లు అన్న డైలాగ్ ఒక ఎత్తు అయితే.. నాకు నీలాంటి ఒక బాబు కావాలి.. ఒక నైట్ స్టే చేయాలని ఒక క్యారెక్టర్ హీరోను బోల్డ్ గా అడిగేస్తే.. 'నేను అలాంటి పని చేయనండి.. లవ్ చేస్తానంతే' అంటూ హీరో చెప్పే డైలాగ్ సినిమా మీద మరింత ఆసక్తిని పెంచుతుంది. హాస్యం.. మరోవైపు రొమాంటిక్ డోస్ తో దట్టించిన ఈ మూవీ మీద అందరిలో ఆసక్తి పెరిగే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు.. ఈ సినిమాలోని కొన్ని డైలాగులు సరికొత్తగా ఉండటమే కాదు.. యూత్ ను ఇట్టే కనెక్టు అయ్యేలా ఉండటం గమనార్హం.
4

ఇందుకు శాంపిల్ గా ట్రైలర్ లో చివరి సీన్లో చెప్పేశారు. అదేమంటే.. హీరో పాత్ర  లవ్ గురించి చెబుతూ.. ''ప్రేమ అనేది సముద్రంలో అలలాంటిది. అలా కదులుతూనే ఉంటుంది. మనసుకు తాకిన ప్రతి అమ్మాయిని ప్రేమిస్తూనే ఉంటాం. ఇది నగ్నసత్యం. కానీ.. ఏ నా కొడుకు ఒప్పుకోడు'' అంటూ కట్ చేసిన డైలాగ్ తో సినిమా ఎప్పుడు విడుదల అవుతుందన్న ఆసక్తిని కలిగిస్తుందని చెప్పక తప్పదు. ఇంతకీ.. ఈ పాతికేళ్ల కుర్రాడికి అరవైఏళ్ల భార్య సీక్రెట్ సినిమా విడుదల అయితే కానీ తేలదని చెప్పక తప్పదు.


Full View
Tags:    

Similar News