• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సత్యరాజ్.. రెమ్యూనరేషన్...

సత్యరాజ్.. రెమ్యూనరేషన్ పీక్స్ లో ఉందట

By - Tupaki Desk
Update: 2019-12-13 05:56 GMT
సీనియర్ తమిళ హీరో.. ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్యరాజ్ కు ఇప్పుడు సౌత్ లో సూపర్ డిమాండ్ ఉంది.  ముఖ్యంగా 'బాహుబలి' రెండు భాగాలు ఘన విజయం సాధించడం.. అందులో సత్యరాజ్ పోషించిన కట్టప్ప పాత్ర ప్రజల మనసుల్లోకి చొచ్చుకుపోయి బలమైన ముద్ర వేయడం తో సత్యరాజ్ కు దేశ వ్యాప్తంగా భారీ గుర్తింపు దక్కింది.  దీంతో కొన్ని ముఖ్య పాత్రలకు ఫిలిం మేకర్స్ ఆయననే ఎంచుకుంటున్నారు.  దీంతో సత్యరాజ్ పారితోషికం పెరిగిపోయిందని టాక్.

సత్యరాజ్ ఒక సినిమాలో నటించాలంటే దాదాపు రూ. 2.5 కోట్లు రెమ్యూనరేషన్ చెల్లించాలి. తమిళ చిత్రానికి ఆయనే డబ్బింగ్ చెప్పుకుంటారు కానీ తెలుగు సినిమా అయితే ఆయనకు డబ్బింగ్ వేరే వ్యక్తి  చెప్పాలి. దీంతో ఆ డబ్బింగ్ కోసం మరో పాతిక లక్షల వరకూ అదనంగా ఖర్చు అవుతుందట. అయినప్పటికీ సత్యరాజ్ ఉంటే సినిమాకు ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో  ఫిలిం మేకర్స్ ఇంత ఖర్చుకూ వెనకాడడం లేదట. నిజంగా కూడా సత్యరాజ్ ఒక అద్భుతమైన నటుడు. అయన పర్సనాలిటీ.. స్క్రీన్ ప్రెజెన్స్ ఏ సినిమా కైనా ఒక బలంగా మారతాయి అనడంలో సందేహమే లేదు.

మారుతి-సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా 'ప్రతిరోజూ పండగే' సినిమా కు.. కార్తి సినిమా 'దొంగ' కు ఆయన ఇదే రకమైన రెమ్యూనరేషన్ అందుకున్నారట.  సత్యరాజ్ హీరోగా ఎన్నో తమిళ సినిమాల్లో నటించారు కానీ ఆయనకు అప్పట్లో ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఎప్పుడూ లభించలేదని..  ఆయన కెరీర్ లో అత్యధిక రెమ్యూనరేషన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడే అందుకుంటున్నారని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    
  • Satya Raj Remueneration 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu Movie News 
  • Telugu Movie Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS