• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రొమాంటిక్ హీరోగా సత్యదేవ్...

రొమాంటిక్ హీరోగా సత్యదేవ్ ను ఒప్పుకుంటారా?

By - Tupaki Desk
Update: 2022-07-03 06:00 GMT
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా టాలీవుడ్ కి వచ్చి .. హీరో అనిపించుకున్నవారిలో సత్యదేవ్ ఒకరు. 'మిస్టర్ పెర్ఫెక్ట్' సినిమాతో పరిచయమైన సత్యదేవ్, ఆ తరువాత చిన్న చిన్న పాత్రలను చేస్తూ 'జ్యోతిలక్ష్మి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు తెరకి ఓ విలక్షణ నటుడు దొరికాడు అనుకునేలా చేయగలిగాడు. ఆ తరువాత 'బ్లఫ్ మాస్టర్' .. '  రాగాల 24 గంటల్లో' ... 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి విభిన్నమైన కథాచిత్రాలు చేసుకుంటూ వెళ్లాడు. అయితే ఆ సినిమాలేవీ ఆయన కెరియర్ కి పెద్దగా హెల్ప్ కాలేకపోయాయి.

ఇక ఇటీవల ఆయన నుంచి 'గాడ్సే' అనే సినిమా వచ్చిందికానీ .. దానిని ఎవరూ పట్టించుకోలేదు. సత్యదేవ్ మంచి ఆర్టిస్ట్ అందులో ఎలాంటి సందేహం లేదు. వరుస ఫ్లాపులు పడుతున్నా ఇంకా ఆయనకి అవకాశాలు వస్తుండటానికి కారణం అదే. అయితే ఆయన తన బాడీ లాంగ్వేజ్ కి భిన్నమైన  కథలను .. పాత్రలను ఎంచుకుంటూ ఉండటం, అలా ఎంచుకున్న కథల్లోను  కొత్తదనం లేకపోవడమే ఈ పరాజయాలకు కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సమాజంలో అవినీతి .. అన్యాయాలను తెరపై ఆవేశంతో చూపించడం వలన సక్సెస్ అయిన సినిమాలు చాలా తక్కువ. అలాంటి జాబితాలోకే 'గాడ్సే' వస్తుంది.

 కథాంశం ఏదైనా దాని చుట్టూ వినోదం అనేది లేకపోతే .. ప్రేక్షకుడు ఒప్పుకోడు. నిత్యం పేపర్లో .. టీవీల్లో చూసే విషయాలను థియేటర్ కి వచ్చి తెలుసుకోవాలనుకోరు. అందువలన సినిమా ప్రధానమైన ఉద్దేశం వినోదాన్ని  అందించడమే .. దానికి మిగతా అంశాలను కలిపి షుగర్ కోటింగ్ ఇస్తే ఓకే. కానీ ఆశయాలను .. సిద్ధాంతాలను ఆవేశంతో చెప్పడానికి ట్రై చేస్తే 'గాడ్సే' లాంటి ఫలితాన్నే అందుకోవలసి వస్తుంది. ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఇప్పుడు సత్యదేవ్ 'గుర్తుందా శీతాకాలం' సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు.

నాగశేఖర్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో సత్యదేవ్ - తమన్నా నాయకా నాయికలుగా నటించారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  టైటిల్ ను బట్టే ఈ కథలో ప్రేమ .. విరహం అనే అంశాలు ప్రధానంగా ఉన్నాయనే విషయం అర్థమవుతోంది. తమన్నా అందగత్తెనే కావొచ్చు కానీ  ఆమెను ప్రేమకథల్లో చూడాలని ప్రేక్షకులు అనుకోవడం లేదు. రొమాంటిక్ టచ్ తో  ఉన్న పాత్రలకి సత్యదేవ్ సెట్  కాడు. ముఖ్యంగా ముదురు ప్రేమకథలను చూడటానికి ఈ కాలం ప్రేక్షకులు ఇష్టపడటం లేదనడానికి కొన్ని ఉదాహరణలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ  సినిమా ఫలితం ఎలా ఉన్నా .. ఇక సత్యదేవ్ తన బాడీ లాంగ్వేజ్ కి తగిన విభిన్నమైన పాత్రలను ఎంచుకోవలసిన సమయం వచ్చేసిందనేది మాత్రం వాస్తవం.       
Tags:    
  • Satyadev 
  • Gurthunda Seethakalam 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Copyright @2026

Powered by Blink CMS