• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కట్టప్పను కూడా...

కట్టప్పను కూడా వదల్లేదుగా..

By - Tupaki Desk
Update: 2016-05-30 06:34 GMT
ఓ తమిళ హీరోకు తెలుగులో కాస్త పేరు వచ్చిందంటే చాలు.. వరుసగా ఆ హీరో తన సొంత భాషలో చేసిన సినిమాలన్నింటినీ అనువదించడం మొదలుపెట్టేస్తారు మన డబ్బింగ్ నిర్మాతలు. ఐతే ఇప్పటిదాకా ఇది హీరోల వరకే పరిమితమయ్యేది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలోనూ ఇదే పద్ధతి ఫాలో అయిపోతున్నారు. మిర్చి.. బాహుబలి.. నేను శైలజ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైపోయిన సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించిన ఓ సినిమాను తెలుగులోకి తేబోతున్నారు. ఆ సినిమానే.. దొర. తమిళంలో ‘జాక్సన్ దురై’ పేరుతో తెరకెక్కిన సినిమా ఇది.

‘జాక్సన్ దురై’ అని గూగుల్లో కొట్టి ఆ సినిమా పోస్టర్ చూస్తే షాకవడం ఖాయం. ఎందుకంటే హాలీవుడ్ సినిమాల్లో దయ్యాల్ని తలపించేలా భయంకరమైన అవతారంలో కనిపిస్తాడు సత్యరాజ్. ‘జాక్సన్ దురై’ హార్రర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న సినిమా. అందుకే సత్యరాజ్ ఇలా తయారయ్యాడు. విశేషం ఏంటంటే ఈ సినిమాలో సత్యరాజ్ కొడుకు శిబిరాజ్ హీరో. తెలుగమ్మాయి బిందుమాధవి హీరోయిన్ గా నటించింది. ధరణీధరన్ దర్శకత్వం వహించాడు. ఏడాదిన్నర కిందటే మొదలైన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. త్వరలోనే విడుదలవుతున్న ఈ సినిమాను.. సత్యరాజ్ కు తెలుగులో ఉన్న క్రేజ్ చూసుకుని తెలుగు లోనూ రిలీజ్ చేయబోతున్నారు. మరి మన ప్రేక్షకులు ఈ చిత్రంపై ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారో చూడాలి.
Tags:    
  • Satya Raj 
  • Jackson Durai Movie 
  • Telugu nEws 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS