• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బౌలర్ కీర్తి.. ఫీల్డర్...

బౌలర్ కీర్తి.. ఫీల్డర్ మహేశ్.. వికెట్ కీపర్ పరశురామ్

By - Tupaki Desk
Update: 2022-05-08 05:30 GMT
ఇప్పుడు నడుస్తున్న ఐపీఎల్ సీజన్ కు తగ్గట్లే.. జరిగే కార్యక్రమాల్లోనూ.. వేడుకల్లోనూ క్రికెట్ ప్రస్తావన తీసుకురావటం కనిపిస్తుంది. అంతదాకా ఎందుకు? ఐపీఎల్ మ్యాచులు జరిగే టైంలో ఎవరు ఎక్కడ ఉన్నా.. ఏ వేడుకలో ఉన్నా.. చేతిలోని మొబైల్ తో మ్యాచ్ ఏమవుతోంది? స్కోర్ బోర్డు సంగతేమిటన్నవిషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవటం కనిపిస్తుంటుంది.

శనివారం హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ‘సర్కారు వారి పాట’’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించిన తమన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన పాటలతో ఇప్పటికే మెస్మరైజ్ చేస్తున్నఆయన చేతికి మైక్ ఇచ్చిన వేళ.. ఆయన మాట్లాడే సమయంలో  ప్రముఖ యాంకర్ సుమతో తకిట తకిట విత్ తమన్ పేరుతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా సుమ ఆసక్తికర అంశాన్ని తమన్ ను అడిగింది.

సినిమా టీంలోని సభ్యులతో క్రికెట్ టీంను తయారు చేస్తే.. ఎవరికి ఏమేం ప్లేసులు ఇస్తారని ప్రశ్నించింది సుమ. దీనికి బదులిచ్చిన తమన్.. బౌలర్ గా కీర్తి సురేశ్ ను ఎంపిక చేస్తానని చెప్పారు. దీనికి స్పందించిన సుమ.. ఆమె బౌలింగ్ కు ఎవరైనా ఔట్ కావాల్సిందేనా? అని అడగ్గా.. ‘అవును.. తన యాక్షన్ తో బాగా నమ్మించేసింది’ అని బదులిచ్చారు. వికెట్ కీపర్ గా డైరెక్టర్ పరశురామ్ ను ఎంపిక చేస్తానని.. సూపర్ స్టార్ మహేశ్ బాబును ఫీల్డర్ గా పేర్కొన్నారు. ఎటు నుంచి వచ్చిన బౌల్ ను అయినా పట్టుకునే ఒక కెప్టెన్ అని.. అది మహేశ్ బాబుగా ఆయన పేర్కొన్నారు. మొత్తానికి ఫీల్డర్ అంటూనే.. మహేశ్ బాబును కెప్టెన్ చేసేసిన తమన్ చాతుర్యానికి చప్పట్లు కొట్టాల్సిందే.
Tags:    
  • Thaman 
  • Suma Comments 
  • Mahesh Babu 
  • Mahesh Babu Comments 
  • Mahesh Babu Pokiri 
  • Mahesh Babu Sarkaru Vaari paata 
  • Keerthy Suresh 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS