రూ.100 ఖరీదు ఫ్రాకులో 2000 కోట్ల ఆస్తి వారసురాలు
రూ.100 ఖరీదు ఫ్రాకులో 2000 కోట్ల ఆస్తికి నటవారసురాలు! .. అవునా ఇది నిజమా? అంటే ఇదిగో ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది. తాను తలుచుకుంటే కొండమీంచి కోతిని అయినా దించగలదు. ఎంత ఖరీదైన డ్రెస్ అయినా కొనుక్కోగలదు. కానీ అందరిలా కాదు ఈ స్టార్ కిడ్. వెరీ రేర్ క్వాలిటీస్ తో కట్టి పడేస్తోంది. ఇంతకీ ఎవరీ అమ్మడు అంటే సారా అలీఖాన్.
పటౌడీ సంస్థానం వారసురాలు అయినా కానీ ఎంతో సింపుల్ గా ఉంటుంది సారా. విమానాశ్రయాల్లో తన కార్ డ్రైవర్ కి సూట్ కేస్ ఇవ్వకుండా తనే మోసుకుంటుంది. ఎక్కడా భేషజానికి పోదు. తన వస్తువులు తనే పట్టుకుని వెళుతుంది.
చిరునవ్వులు చిందిస్తూ.. అలా హాయ్ చెప్పేస్తుంది. సాటి హీరోలతో అంతే స్నేహంగా ఉంటుంది. ఇదిగో ఇలా వీధుల్లోకి వచ్చినప్పుడు ఒక్కోసారి చాలా సింపుల్ గా 100 ఖరీదు ఫ్రాకుతోనే షికార్ బయల్దేరిపోతుంది. అలా కెమెరా కంటికి చిక్కితే నవ్వుల పువ్వుల్ విసిరేస్తుంది.
పటౌడీ సంస్థానాధినేత్రి.. 2000కోట్ల ఆస్తిపరురాలు ఏంటీ ఇంత సింపుల్ గా ఉంది? అంటూ యూత్ ఎంతో ఇదిగా మాట్లాడుకుంటున్నారంటే.... ఎదిగినా ఒదిగి ఉండే తత్వం సారాకి ఉంది కాబట్టే. అందుకే వడి వడిగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగేస్తోంది. వరుసగా క్రేజీ సినిమాల్లో నటించేస్తోంది. మునుముందు సౌత్ లోనూ అడుగు పెట్టబోతోంది. ధనుష్ సరసన ఇప్పటికే ఓ సినిమాలో నటిస్తోంది. చరణ్.. బన్ని.. ఎన్టీఆర్ లాంటి స్టార్లు సారా లాంటి నాయికను టాలీవుడ్ కి రప్పించే ప్లాన్ లో ఉన్నారని ఇంతకుముందు ప్రచారమైంది.
ఆదివారం బాంద్రా(ముంబై)లోని ఫార్మర్స్ కేఫ్ లో నటి షర్మిన్ సెగల్ ఆమె స్నేహితులతో కలిసి లంచ్ కు వెళుతూ సారా ఇలా కనిపించింది. వంద ఖరీదు ఫ్రాకు సరే.. ఇంతకీ ఆ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు ఎంత? అంటే .. సుమారు రూ. 900. ఇదంతా చూస్తుంటే.. సరసమైన ధరలకు ఫ్రాకులు హ్యాండ్ బ్యాగులు ఎలా కొనాలో టిప్స్ సారానే అడగాలేమో!!