స్టార్ డాట‌ర్ త‌ళుకుబెళుకులు సంథింగ్!

Update: 2021-12-09 16:33 GMT
బాలీవుడ్  యంగ్ బ్యూటీ.. సైఫ్ అలీఖాన్ డాట‌ర్ సారా అలీఖాన్ కెరీర్ జెట్ స్పీడ్ తో ప‌రుగులు పెడుతోన్న సంగ‌తి తెలిసిందే. `కేధార‌నాథ్` స‌క్సెస్ తో ప్రారంభ‌మైన సారా ప్ర‌స్థానం  అటుపై ``సింబా`..`ల‌వ్ ఆజ్ క‌ల్` స‌క్సెస్ తో మ‌రింత స్పీడ్ అందుకుంది. ప్ర‌స్తుతం అక్ష‌య్  కుమార్.. ధ‌నుష్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న `అట్రాంగిరే`లో న‌టిస్తోంది. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ `అట్రాంగిరే` ప్ర‌చారం ప‌నుల్లో బిజీగా ఉంది.

ఓ వైపు ప‌బ్లిసిటీ టాస్క్ చూసుకుంటూనే మ‌రోవైపు కొత్త ఫోటో సెష‌న్ల‌కు  కావాల్సినంత స‌మ‌యాన్ని కేటాయిస్తోంది. సినిమా ప్ర‌చారం ప్రారంభ‌మైన నాటి నుంచి ప‌లుమార్లు ఫోటో సెష‌న్స్ లో పాల్గొంది. తాజాగా సారా మ‌రోసారి కెమెరాకి ఫోజులిచ్చింది. లెహంగా లుక్ లో సారా కుర్ర‌కారులో మంట‌లు రేపుతోంది. డిజైన‌ర్ లెహంగాలో  కెమారాకి వివిధ భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది. మెడ‌లో నెక్లెస్.. కుడిచేతి చూపుడు వేలికి మెరుస్తున్న ఉంగ‌రంతో కొన్ని క్లోజ్ అప్ షాట్స్ లో సారా మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌నుంది.

ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. సారా అభిమానులు త‌మ‌దైన శైలిలో  కామెంట్లు.. ఎమోజీలు పోస్ట్ చేస్తున్నారు. సారాలో సోలో ఫోటో సెష‌న్స్ లోనే కాదు.. ఫ్రెండ్  జాన్వీక‌పూర్ తో జంట‌గాను చాలాసార్లు కెమెరాకి ఫోజులిచ్చింది. ఇద్ద‌రు పోటా పోటీగా చెల‌రేగిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే జాన్వీకి వెనుక బ్యాక్ బోన్ గా క‌ర‌ణ్ జోహార్ నిర్మాణ సంస్థ‌ ధ‌ర్మ ప్రోడ‌క్ష‌న్స్ ఉండ‌టంతో సారా కంటే జాన్వీ లైన‌ప్ మ‌రింత మెరుగ్గా ఉంద‌ని చెప్పొచ్చు.
Tags:    

Similar News