• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సెన్సార్ ఫినిష్.....

సెన్సార్ ఫినిష్.. 'కొరియన్ కనకరాజు' ఇన్‌సైడ్ టాక్ ఏంటంటే!

| వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' సినిమా విడుదలకి టైమ్ చాలా తక్కువగా ఉంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడు పెంచారు.

By - M Prashanth
Update: 2026-08-04 07:54 GMT

వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' సినిమా విడుదలకి టైమ్ చాలా తక్కువగా ఉంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడు పెంచారు. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక రన్‌టైమ్‌ను 2 గంటల 36 నిమిషాలుగా లాక్ చేశారు. కాన్సెప్ట్ రీత్యా ఇది పర్ఫెక్ట్ నిడివి అని తెలుస్తోంది.

సెన్సార్ పూర్తయిన తర్వాత ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం సినిమాలోని కామెడీ సన్నివేశాలు చాలా బాగా వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వరుణ్ తేజ్, కమెడియన్ సత్య మధ్య వచ్చే కామెడీ సీన్లు హైలెట్ అని టాక్. వరుణ్ తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకుని నవ్వించే ప్రయత్నం చేయగా, సత్య తన మార్క్ టైమింగ్‌తో బాగా ప్లస్ అయ్యాడని సమాచారం.

దర్శకుడు మేర్లపాక గాంధీ తీసుకున్న కొరియన్ కల్చర్, లోకల్ అనంతపురం బ్యాక్‌డ్రాప్ మిక్సింగ్ పాయింట్ బాగా కుదిరినట్లు తెలుస్తోంది. హారర్ ఫాంటసీకి హ్యూమర్ తోడవ్వడంతో వచ్చే కన్ఫ్యూజన్ డ్రామాను స్క్రీన్‌ప్లేతో డీల్ చేశారని టాక్. రొటీన్ దెయ్యాల కథలా కాకుండా, కల్చరల్ డిఫరెన్సెస్ వల్ల వచ్చే సిట్యువేషనల్ ఫన్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించే అవకాశం ఉంది.

టెక్నికల్ సైడ్ చూసుకుంటే తమన్ అందించిన పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేసిందని చెబుతున్నారు. సీన్లలోని ఫన్‌తో పాటు హారర్ ఎలిమెంట్స్‌కు తగినట్లు ఆర్ఆర్‌ఆర్ అందించడంలో తమన్ తన మార్క్ చూపించారట. బడ్జెట్‌కు తగ్గట్లుగా నాణ్యమైన విజువల్స్ తెచ్చేలా మేకర్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా కుదిరాయని అంటున్నారు.

ఇక ప్రమోషనల్ వీడియోలతోనే క్యూరియాసిటీ పెంచిన 'కొరియన్ కనకరాజు', ఇప్పుడు సెన్సార్ టాక్‌తో మరిన్ని ఆశలు రేపుతోంది. భారీ అంచనాలతో కాకుండా ప్రాక్టికల్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్‌కు ఈ సినిమా మంచి ఆప్షన్ అయ్యేలా ఉంది. మరి ఆగస్టు 7న థియేటర్లలో ఈ హారర్ కామెడీ ఏ రేంజ్ కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.


సెన్సార్ టాక్: '#KoreanKanakaraju' బ్లాక్‌బస్టర్!!#VarunTej నటించిన ‘కొరియన్ కనకరాజు’ సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. 2 గంటల 36 నిమిషాల నిడివితో విడుదల కానున్న ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

వరుణ్ తేజ్–సత్య కామెడీ, క్రాస్-కల్చరల్ కాన్సెప్ట్,… pic.twitter.com/G1nXg2W1wl

— Tupaki (@tupaki_official) August 4, 2026


Tags:    
  • koreankanakaraju 
  • varuntej 
  • merlapakagandhi 
  • rithikanayak 
  • satya 
  • thaman 
  • tollywood 
  • tollywoodnews 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS