నాని 'ది ప్యారడైజ్'.. తేల్చుకునే టైమొచ్చింది
లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆగస్టు 6న టీజర్ రాబోతుందంటూ విడుదల చేసిన పోస్టర్ మాములుగా లేదు.
రొటీన్ మాస్ ఎలిమెంట్స్ కు దూరంగా ఉంటూ విభిన్నమైన కాన్సెప్టులతో ప్రయోగాలు చేయడం నానికి కొత్తేమీ కాదు. దసరా సినిమాతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అందించిన రా మేకింగ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపిందో అందరూ చూశారు. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ లో రాబోతున్న 'ది ప్యారడైజ్' సినిమాపై మంచి క్యూరియాసిటీ ఉంది. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆగస్టు 6న టీజర్ రాబోతుందంటూ విడుదల చేసిన పోస్టర్ మాములుగా లేదు.
అయితే అప్పటివరకు ఒక రకమైన బజ్ తో ఉన్న ఈ సినిమాకు అసలైన టైమ్ లైన్ లోకి అడుగు పెట్టింది. పోస్టర్స్ తోనే కిక్ ఇచ్చిన మేకర్స్ ఆ తర్వాత ఆయా షేర్ పాటను మత్తులాగా ఎక్కించేశారు. కాబట్టి టీజర్ అంతకుమించిన కిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టీజర్ క్లిక్ అయితే పాన్ ఇండియా రూట్లో మరింత స్పీడ్ పెంచే చాన్స్ ఉంటుంది.
ఇక టీజర్ ఎనౌన్స్ మెంట్ పోస్టర్ కూడా ఆసక్తిగా ఉంది. రెగ్యులర్ యాక్షన్ సినిమాలకు ఇచ్చే పోస్టర్లు కేవలం హీరో కటౌట్, ఆటిట్యూడ్ మీదే ఆధారపడి ఉంటాయి. కానీ ఈ పోస్టర్ లో డిజైన్ చేసిన విజువల్ ఎలిమెంట్ చాలా డిఫరెంట్ గా ఉంది. హీరో నిలబడిన చోట కింద ఉన్న నీడ ఒక పెద్ద కాకి రెక్కలు విప్పి ఎగురుతున్నట్లు కనిపిస్తోంది. "అతని నీడకు కూడా ఎగిరే రెక్కలు ఉన్నాయి" అనే పోస్టర్ లైన్ ఈ విజువల్ కి మరింత బలాన్నిచ్చింది. ఏదో స్టైలిష్ ప్రెజెంటేషన్ మాత్రమే కాకుండా కథలోని పాత్ర స్వభావాన్ని చూపించినట్లు అనిపిస్తోంది.
సమాజంలో అణచివేతకు గురైన ఒక వ్యక్తి తిరుగుబాటు చేసే క్రమంలో అతనికి లభించే స్వేచ్ఛను ఈ రెక్కల రూపంలో సింబాలిక్ గా చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ తన స్క్రీన్ ప్లే లో ఇలాంటి రా అండ్ డార్క్ ఎలిమెంట్స్ ను చాలా నేచురల్ గా ఎస్టాబ్లిష్ చేస్తారనే పేరు ఉంది. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించడం మరో కీలకమైన విషయం.
ఈసారి శ్రీకాంత్ క్రియేట్ చేసిన రా కంటెంట్ కు అనిరుధ్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలాంటి వైబ్ తెస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాఘవ్ జుయాల్, మోహన్ బాబు, కాయాదు లోహర్ లాంటి విభిన్నమైన నటీనటులు ఈ సినిమాలో భాగమవ్వడం కూడా ప్రాజెక్ట్ కి ఒక డిఫరెంట్ లుక్ తెచ్చిపెట్టింది. ఆగస్టు 6న రాబోతున్న ఈ టీజర్ ద్వారా అసలు కథా నేపథ్యం ఏంటి, శ్రీకాంత్ ఈసారి ఎలాంటి ప్రపంచాన్ని చూపించబోతున్నారు అనే విషయాలపై క్లారిటీ రానుంది. మరి ఈ 'ది ప్యారడైజ్' టీజర్ నేటి తరం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చేస్తుందో చూడాలి.