ప్రైవసీ ఉల్లంఘన, అనుభవించిన వేదన.. ఇంటీమేట్ సీన్ లీక్!
బాలీవుడ్ విలక్షణ నటి రాధికా ఆప్టే సినిమా ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు.
బాలీవుడ్ విలక్షణ నటి రాధికా ఆప్టే సినిమా ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ఎంతటి సంక్లిష్టమైన సీన్స్‌లోనైనా సహజ సిద్ధమైన నటనను ప్రదర్శించడం అమ్మడి ప్రత్యేకత. ఇటీవల `లస్ట్ స్టోరీస్ 3` ప్రాజెక్ట్‌తో మరోసారి వార్తల్లో నిలిచిన నటి గతంలో ఓ సినిమాకి చెందిన తన శృంగార సన్నివేశం లీక్ అయినప్పుడు తాను అనుభవించిన మానసిక వేదనను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఆ సంఘటన తన జీవితంలో మిగిల్చిన చేదు జ్ఞాపకగా అభివర్ణించారు.
ఆ క్లిప్ వైరల్ అయిన తర్వాత నేను నాలుగు రోజుల పాటు ఇల్లు దాటి బయటకు రాలేకపోయాను. తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన తో ప్రపంచాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇంటికే పరిమితమైనట్లు తెలిపారు.
ఆ సమయంలో చుట్టూ ఉన్న ప్రజలు, సమాజం నుంచి ఎదురైన చూపులు తట్టుకోవడం మరింత కష్టంగా మారిందని రాధికా వివరించారు. లీకైన సదరు వీడియా క్లిప్‌ను చుట్టూ ఉన్నవారందరూ చూడటం, దాని గురించే చర్చించుకోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు.
ఒక నటిగా పాత్రల కోసం కెమెరా ముందు నటించడం వేరని, కానీ అనుమతి లేకుండా ప్రైవేట్ క్లిప్‌లను నెట్‌లో పెట్టి వ్యాపారం చేయడం ..వైరల్ చేయడం ఆ నటి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు.
ఆ క్లిష్ట సమయంలో తన భద్రత , మనశ్శాంతి కోసం తన వద్ద పనిచేసే సిబ్బందిని కాపలాగా ఉంచుకోవాల్సి వచ్చిందని రాధికా ఆప్టే గుర్తు చేసుకున్నారు. `నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయకుండా నా దగ్గరకు ఎవరూ రాకుండా చూడమని నా వాచ్‌మన్, డ్రైవర్, హౌస్ హెల్ప్‌లకు ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది. నన్ను నేను రక్షించుకోవడానికి వారిని రక్షణగా నిలబెట్టాను` అని తెలిపారు.
మీడియా, సోషల్ మీడియా ట్రోల్స్ ఇచ్చే ఒత్తిడిని తట్టుకోవడం ఆ సమయంలో ఎంతటి సవాలుగా మారిందో వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అయినా? ఇలాంటి వివాదాలు, అనుభవాలు ఎదురైనా? రాధికా ఆప్టే ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. నటిగా హద్దులను విస్తరించుకుంటూ కథకు అవసరమైన బోల్డ్ పాత్రలలో ధైర్యంగా నటిస్తూనే ఉన్నారు. అయితే డిజిటల్ యుగంలో నటి గౌరవానికి, ప్రైవసీకి జరుగుతున్న భంగానికి రాధికా ఆప్టే ఎదుర్కొన్న సంఘటన ఒక నిదర్శనం. వ్యక్తిగత హద్దులను ఉల్లంఘించే లీక్ సంస్కృతిని నిరోధించాల్సిన అవసరం ఉందనే చర్చ ఈ వ్యవహారం మళ్లీ ముందుకు తెస్తుంది.