మామ ర‌జ‌నీ కోస‌మే కాదు సూర్య కోసం ధ‌నుష్ త్యాగం!

మామ రజనీకాంత్ కోసం మాజీ అల్లుడు ధనుష్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.

Update: 2026-09-24 03:15 GMT

మామ రజనీకాంత్ కోసం మాజీ అల్లుడు ధనుష్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. కేవలం రజనీకాంత్ మాత్రమే కాకుండా.. మరో స్టార్ హీరో సూర్య కోసం కూడా ఆయన తన సినిమా విడుదలను వాయిదా వేసుకొని చిత్ర పరిశ్రమపై తనకు ఉన్న‌ గౌరవాన్ని నిరూపించుకున్నారు. `అమరన్` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరిసామి దర్శకత్వంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి- వర్సటైల్ హీరో ధనుష్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా `OM` (ఓం) పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

వాస్తవానికి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల చేయాలని భావించారు. అయితే అదే సమయంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ చిత్రం `జైలర్ 2` కూడా బరిలో దిగుతుండటంతో రజనీకాంత్ పై ఉన్న అపారమైన గౌరవంతో ధనుష్ ఈ సినిమా విడుదలను వెనక్కి తీసుకున్నారు. `జైలర్ 2` మాస్ - కమర్షియల్ కథాంశంతో వస్తుండగా, `OM` మాత్రం సమాజంలో కలిసిపోయే అన్‌సంగ్ హీరోల (గొప్ప వ్యక్తులుగా గుర్తించబడని సాధారణ వ్యక్తులు) భావోద్వేగాల చుట్టూ తిరిగే విభిన్నమైన యాక్షన్ డ్రామా కావడం విశేషం.

కేవలం దసరా రేసు నుంచే కాకుండా దీపావళి బరి నుంచి కూడా OM తప్పుకుంది. నవంబర్ 6న సూర్య హీరోగా జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్నమైన కాప్ యాక్షన్ డ్రామా `సీన్` (ఇందులో సూర్య సరసన నజ్రియా నజీమ్, నాస్‌లీన్ తదితరులు నటిస్తున్నారు) విడుదలవుతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద సినిమాల క్లాష్‌ను నివారించి ఇండస్ట్రీ శ్రేయస్సును కాపాడాలనే ఉద్దేశంతో ధనుష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ధ‌నుష్ `ఓఎం` చిత్రంలో సాయి పల్లవి- శ్రీలీల కథానాయికలుగా నటిస్తుండగా..గోపురం ఫిలింస్ బ్యానర్‌పై అన్బుచెజియన్ దీనిని నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సినిమా బిజినెస్ పరంగా.. బాక్సాఫీస్ వద్ద అనవసరమైన పోటీని తగ్గించడానికి నిర్మాతలు, హీరోలు తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు టాలీవుడ్- కోలీవుడ్ వర్గాల్లో ఎంతో ప్రశంసలు అందుకుంటున్నాయి. `OM` సినిమాకు సంబంధించిన కొత్త విడుదల తేదీని త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.

ధ‌నుష్ కి జాతీయ అవార్డ్ అందుకున్న త‌ర్వాత OM సినిమా ఎలాంటి ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉంది అంటే... ధనుష్‌కి `ఆడుకాలమ్` చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చిన తర్వాత విడుదలైన `3` (త‌మిళంలో హిట్టు) సినిమా ఆయన కెరీర్‌లో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు జాతీయ అవార్డ్ అందుకున్న త‌ర్వాత‌ `ఓఎం` సినిమా కూడా అలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందా? అన్న‌ది వేచి చూడాలి.

Tags:    

Similar News