స్టార్ కిడ్ క‌విత్వం: గాలి చ‌ప్పుడు.. స‌ముద్ర‌ హోరు వినిపించ‌దు.. హృద‌య స్పంద‌న త‌ప్ప‌!

Update: 2021-09-06 23:30 GMT
బాలీవుడ్ న‌టి సారా అలీఖాన్ టైమ్ దొరికిందంటే వెకేష‌న్స్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. ప్ర‌పంచాన్ని చుట్టేయాల‌ని ప్లాన్ చేస్తుంది. అందులోనూ  మాల్దీవుల్లో చిలౌట్ అవ్వ‌డం అంటే సారాకి స్పెష‌ల్ ఇంట్రెస్ట్. ఈ ఏడాది ఆరంభంలో ఫిబ్ర‌వ‌రిలోనే సోద‌రుడు ఇబ్రహీం అలీకాన్ తో మాల్దీవుల‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. సోద‌రుడితో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోల్ని అభిమానుల‌తో పంచుకుని ఫీలింగ్ హ్యాపీ అంటూ  ట్యాగ్ చేసింది. స‌రిగ్గా కొవిడ్ సెకెండ్ వేవ్ మొద‌ల‌వుతోన్న త‌రుణం కావ‌డంతో ఎక్కువ రోజులు గ‌డ‌ప‌లేక‌పోయింది పాపం! అందుకే ఇప్పుడు మ‌రోసారి  మాల్దీవులకు జంప్ అయ్యింది. ఈసారి ఒంట‌రిగానే ప్లైట్ ఎక్కింది ఈ బ్యూటీ.

సెప్టెంబ‌ర్ 2న మాల్దీవుల‌కి బ‌య‌ల్దేరిన‌ట్లు ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి లీకైన ఫోటోలు వెల్ల‌డించాయి.. ఆ స‌మ‌యంలో  సారా వీఐపీ ఎంట్రీ ఉన్నా ..అంద‌రితో కలిసి సాధార‌ణ ఎంట్రీ ద్వారానే లోపలికి వెళ్లింది. కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ సారా ప్లైట్   ఎక్కింది. స‌రిగ్గా ఎయిర్ పోర్ట్ గేట్ ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర మాస్క్ వేసుకుని ఉండ‌టంతో ఓ పెద్దాయ‌న‌ మీ పేరెమిటి? అని ప్ర‌శ్నించాడు. అందుకు విన‌యంగా  `ఐయామ్ సారా స‌ర్` అంటూ గౌర‌వంగా స‌మాధానం ఇచ్చింది. ఆ త‌ర్వాత మాస్క్ తీసి త‌న ముఖాన్ని చూపించింది. స్టార్ కిడ్ అయినా ఎలాంటి త‌ల‌బిరుసు లేకుండా ఎంతో హుందాగా న‌డుచుకోవ‌డం ఆశ్చ‌ర్య ప‌రిచింది. త‌న వెంటే డ్రైవ‌ర్ సెక్యూరిటీ వాళ్లు ఉన్నా విమానాశ్ర‌యాల్లో సారా ఎల్ల‌పుడూ త‌న ల‌గేజ్ తానే మోసుకుంటూ రావ‌డం ఇంత‌కుముందు చూసిన‌దే.

మ‌రో కోణంలో సారా విహార‌యాత్ర‌లు ఫోటోషూట్లు అంతే హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సారా మాల్దీవుల్లో ఎలా ఎంజాయ్ చేసిందంటే ..ర‌వి అస్త‌మిస్తోన్న స‌మ‌యంలో  బీచ్ లో ఎర్ర‌ని కిర‌ణాలు తాకుతుండ‌గా ఫోటోషూట్ల‌తో దుమారం రేపింది.  వైట్ ష‌ర్ట్.. బ్లాక్ ప్యాంట్ ధ‌రించి సింపుల్ క్యూట్ లుక్ లో సారా ఆక‌ట్టుకుంది. ఆ ఫోటోని ఉద్దేశించి ఓ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. భ‌విష్య‌త్ లో అద్భుతాలు జ‌రుగుతాయ‌ని ఆశిద్దాం. ఇక్క‌డ గాలి.. స‌ముద్రం తాలూకా శ‌బ్ధం విన‌బ‌డ‌దు. శ్యాస‌.. హృద‌య స్పంద‌న మాత్ర‌మే వినిపిస్తాయి`` అంటూ త‌న మ‌న‌సును ప‌రిచేసిన సారా పోయెటిక్ గా స్పందించింది. త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన‌ మాల్దీవుల గొప్ప‌త‌నాన్ని సారా చెప్ప‌క‌నే చెప్పింది. సూర్యుడితో పాటు కొన్ని ఫ్ల‌వ‌ర్ ఎమోజీల‌ను సారా పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం సారా ఆనంద్ ఎ ల్ రాయ్  ద‌ర్శ‌క‌త్వంలో అట్రాంగిరే అనే సినిమాలో న‌టిస్తోంది. ఇందులో అక్ష‌య్  కుమార్.. ధ‌నుష్ హీరోలుగా న‌టిస్తున్నారు.
Tags:    

Similar News