సప్తగిరి బౌన్స్ బ్యాక్..కామెడీ రోల్స్ కి రెడీ!
`ప్రేమకథా చిత్రమ్`తో కమెడియన్ గా పాపులరై.. `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్`తో పీక్స్ కి చేరుకున్నాడు సప్తగిరి. కెరీర్ పరంగా క్షణం తీరిక లేనంత బిజీ కమెడియన్ గా రాణించాడు. కడుపుబ్బా నవ్వించగలిగే మరో స్టార్ కమెడియన్ పరిశ్రమకు దొరికాడని ప్రశంసించారంతా. అయితే ఆ తర్వాతే రూటు మారింది. కమెడియన్ సప్తగిరి కాస్తా అనూహ్యంగా హీరో అయ్యి సప్తగిరి ఎక్స్ ప్రెస్.. సప్తగిరి ఎల్.ఎల్.బి (జాలీ ఎల్.ఎల్.బి రీమేక్) అంటూ ప్రయోగాలు చేశాడు. ఈ ప్రయోగాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ ని ఇవ్వలేదు. అయితే ఆ సినిమాల వల్ల ట్రేడ్ లో తమకు ఏమాత్రం నష్టం రాలేదని సప్తగిరి దర్శకనిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొంత గ్యాప్ తర్వాత తిరిగి సప్తగిరి మరో భారీ ప్రయోగంతో బరిలో దిగాడు. ఈసారి `వజ్రకవచధర గోవిందా` అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమాని మే మిడిల్ లో రిలీజ్ చేయాలని భావించినా రకరకాల సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. ప్రస్తుతం సినిమా రిలీజ్ కి ముహూర్తం ఫిక్సయ్యింది. ఈ శుక్రవారం (జూన్ 14) సినిమా రిలీజవుతోంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో మీడియాతో ముచ్చటించిన సప్తగిరి పలు ఆసక్తికర సంగతుల్ని తెలిపారు. వజ్రకవచధర గోవింద టైటిల్ పాత్రలో నటిస్తున్నానని తెలిపారు. లక్ష్యం ఎంత గొప్పది అయినా వెళ్లే మార్గం మంచిది అయితేనే ఆ దేవుడి సహకారం ఉంటుంది.. అనే ఒక డివైన్ పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఒక ఊరి మేలు కోసం కథానాయకుడు ఏం చేశాడన్నది తెరపైనే చూడాలి... అని తెలిపారు. హిలేరియస్ కామెడీ... యాక్షన్ .. అడ్వెంచర్ ఆకట్టుకుంటాయని అన్నారు.
కమెడియన్ నుంచి మారి కథానాయకుడు అవ్వడం రిస్క్ అవ్వలేదా? హీరోలు అయిన కమెడియన్లు తిరిగి క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్టవుతున్నారు కదా? అన్న ప్రశ్నకు.. సప్తగిరి ఇచ్చిన సమాధానం ఆసక్తికరం. అందరి లైఫ్ వేరు. నా లైఫ్ వేరు. నా ప్రణాళికలు వేరు. నా వరకూ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా అవుతుంది.. అలా అవుతుంది అన్నది నేను నమ్మను. నా దారి వేరు. నేను వెళ్లే రూట్ పై నాకు స్పష్టత ఉంది. ఏదో అవుతుందని నేను భయపడను.. అని సప్తగిరి క్లారిటీతో సమాధానం ఇచ్చారు. హీరోగా తన కెరియర్ కి వచ్చిన ఢోకా ఏదీ లేదన్న కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేశారు. వజ్రకవచధర గోవింద తర్వాత ఏ సినిమాలు చేస్తున్నారు? అన్న ప్రశ్నకు.. తదుపరి ఓ దెయ్యం కథతో సినిమా చేస్తున్నానని తెలిపారు. రెండు కథలు సిద్ధమవుతున్నాయి. అయితే వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అన్నారు.
హీరోగానే చేస్తారా.. కమెడియన్ గా చేయరా? అన్న ప్రశ్నకు .. తాను హీరోగా చేసినా కమెడియన్ గా నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని .. తనవైపు వచ్చే క్యారెక్టర్లు చేస్తూ కెరియర్ ని ముందుకు సాగిస్తానని స్పష్టంగా చెప్పారు. ఇటీవల కమెడియన్లు సునీల్ .. శ్రీనివాస్ రెడ్డి హీరోలు అయినా తిరిగి క్యారెక్టర్లు చేస్తూ కెరియర్ పరంగా గ్యాప్ లేకుండా ముందుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. అల్లరి నరేష్ అంతటి టాప్ కామెడీ హీరో భారీ మల్టీస్టారర్లలో క్యారెక్టర్లు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ క్రమంలోనే కమెడియన్ టర్న్ డ్ హీరో సప్తగిరి సైతం తనకు క్యారెక్టర్లు చేసేందుకు ఎలాంటి భేషజం లేదని చెప్పారు.
సప్తగిరి నటించిన `వజ్రకవచధర గోవింద` చిత్రాన్ని బయ్యరు బ్రహ్మయ్య 3.60 కోట్లకు చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అడ్వెంచర్.. సందేశం ఉన్న కథాంశం థ్రిల్ కి గురి చేస్తుందని .. 6-9 కోట్ల పెట్టుబడితో తీసిన సినిమాలా రిచ్ గా ఉంటుందని ఆయన అన్నారు.. యాక్షన్ అడ్వెంచర్.. డివైన్ మూవీ ఇదని తెలిపారు. సీడెడ్ ఎగ్జిబిటర్ కం డిస్ట్రిబ్యూటర్ 33 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన రంగస్థలం, ఎఫ్ 2 సహా పలు బ్లాక్ బస్టర్లు చిత్రాల్ని పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.