• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సప్తగిరిలో మరో కోణం

సప్తగిరిలో మరో కోణం

By - Tupaki Desk
Update: 2016-10-19 22:30 GMT
ఇప్పటి వరకు కమెడియన్ సప్తగిరిలో కామెడీ కోణాన్నే చూసి ఎంజాయ్ చేశాం. త్వరలో విడుదల కాబోయే ‘సప్తగిరి’ ఎక్స్ ప్రెస్’లో మాత్రం మరో కోణాన్ని కూడా ఆవిష్కరించబోతున్నాడంట ఈ స్టార్ కమెడియన్. తండ్రి సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కానిస్టేబుల్ కథే ఈ చిత్రం. ఇందులో కామెడితో పాటు సెంటిమెంట్ కి ప్రాధాన్యం వుంది అంటున్నాడు సప్తగిరి. ఇప్పటి వరకు కేవలం తనలోని కామెడీ యాంగిల్ మాత్రమే చూసిన ఆడియన్స్... ఇందులో వున్న సెంటిమెంట్ యాంగిల్ ను కూడా చూసి.. మెచ్చుకుంటారని అంటున్నాడు.

ఓ రకంగా ఈ సినిమా కథకు... తన నిజ జీవిత కథకు చాలా దగ్గరి పోలికలు వుండబట్టే ఈ సినిమా చేయడానికి ఒప్పకున్నాడట. నిజ జీవితంలో తన తండ్రి ఓ ఫారెస్ట్ గార్డ్ గా పని చేశాడు. మధ్య తగతి కుటుంబానికి చెందిన సప్తగిరి... మల్టీమీడియా కోర్సు చేయడం కోసం చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి హైదరాబాద్ వచ్చి.. అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేశారు. ఓ వైపు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూనే.. మరోవైపు చిన్న చిన్న పాత్రలు పోషించి దర్శకుల దృష్టిలో పడ్డాడు. స్టార్ కమెడియన్ అయిపోయాడు. అయితే ఇప్పుడొచ్చిన స్టార్ స్టేటస్ అంతా.. ఓవర్ నైట్ లో వచ్చింది కాదని... దాని వెనుక ఎంతో శ్రమ.. బాధలు వున్నాయంటున్నాడు సప్తగిరి. ఓ సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఎదురైన సంఘటనలు ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ స్క్రిప్టులో వున్నందునే తను ఇందులో హీరోగా నటించడానికి ఒప్పుకున్నానంటున్నాడు.

గతంలో చాలా మంది హీరోగా నటించమని అడిగినా... మంచి కథ ఇన్నాళ్లకు దొరకడంతో.. ఇందులో హీరోగా నటించానంటున్నాడు. ఇందులో ఎలాంటి స్పూఫ్ లు గానీ.. ఇమిటేషన్స్ కానీ వుండని.. కేవలం తన కామెడీ... సెంటిమెంట్ పాత్రలు మాత్రమే వుంటాయంటున్నాడు. పాటలకోసం పోలెండ్ - జర్మనీ - ఫ్రాంక్ ఫర్డ్ తదితర చోట్లకు వెళ్లినట్టు చెప్పారు. ఇక్కడే షూట్ చేద్దామని అనుకున్నా... నిర్మాత కోరిక మేరకు విదేశాల్లో పాటలను తెరకెక్కించాం అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sapthagiri 
  • Tollywood Movies 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS