• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రిలీజ్ ట్రైలర్: మారుతి...

రిలీజ్ ట్రైలర్: మారుతి మార్కు కామెడీతో 'మంచి రోజులు వచ్చాయి'

By - Tupaki Desk
Update: 2021-10-30 10:17 GMT
సంతోష్ శోభన్ - మెహరీన్ కౌర్ ఫిర్జాదా హీరోహీరోయిన్లుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి రూపొందించిన తాజా చిత్రం ''మంచి రోజులు వచ్చాయి''. వాస్తవ సంఘటన ఆధారంగా మారుతి మార్కు కామెడీ, ఎంటర్టైన్మెంట్ ను మేలవించి ఈ సినిమాను రెడీ చేశారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ అందించిన పాటలు కూడా మంచి స్పందన తెచ్చుకున్నాయి.

దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ముమ్మరం చేసిన 'మంచి రోజులు వచ్చాయి' మేకర్స్.. సక్సెస్ ఫుల్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఇప్పటికే ఓ ట్రైలర్ నెట్టింట సందడి చేస్తుండగా.. తాజాగా రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేశారు.

ఆద్యంతం ఎంటర్టైనింగ్ సాగిన 'మంచి రోజులు వచ్చాయి' రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు కలిగించింది. సంతోష్ తో ప్రేమలో ఉన్న మెహ్రీన్.. కొలీగ్ తో స్నేహం చేస్తున్నట్లు తన తండ్రితోచెప్పడం.. కూతురి బిహేవియర్ మీద డౌట్ వచ్చి ఆమె తండ్రి ఇన్వెస్టిగేషన్ చేయడం.. ఈ క్రమంలో వీరి ప్రేమ విషయం తెలిసిన తండ్రి పెళ్లికి ఒప్పుకోకపోవడం.. దీంతో కాబోయే మామను హీరో ముప్పుతిప్పలు పెట్టడం వంటి అంశాలు బోలెడంత ఫన్ ని క్రియేట్ చేశాయి.

ప్రతీ సిసినిమాలో ఏదొక లోపం గురించి లెవనెట్టే మారుతి.. ఈసారి హీరోయిన్ తండ్రికి కరోనా మహమ్మారి ఉన్నట్లు చూపించారు. మారుతి బ్రాండ్ రొమాన్స్ తో పాటు సిట్యుయేషనల్ కామెడీని కూడా వర్కవుట్ చేసే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన మావా బ్రో - ఇంటర్మీడియెట్ నిబ్బాస్ వంటి పదాలతో అల్లిన డైలాగ్స్ అలరిస్తున్నాయి.


సంతోష్ శోభన్ - మెహ్రీన్ జంట మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఈ చిత్రంలో అజయ్ ఘోష్ - వెన్నెల కిషోర్ - శ్రీనివాస్ రెడ్డి - ప్రవీణ్ - సప్తగిరి - సుదర్శన్ - వైవా హర్ష - సత్యం రాజేష్ - శ్రీకాంత్ అయ్యంగార్ - రజిత తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా.. రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఉద్ధవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

'మంచి రోజులు వచ్చాయి' చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. వి సెల్యులాయిడ్ - SKN దీనికి నిర్మాతలుగా వ్యవహరించారు. ‘ఏక్ మినీ కథ’ వంటి సూపర్ హిట్ తర్వాత సంతోష్ శోభన్ నటిస్తోన్న సినిమా కావడం.. అలానే ‘ప్రతి రోజూ పండగే’ సక్సెస్ తర్వాత మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కావడంతో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి మారుతి సక్సెస్ జోరును కొనసాగిస్తారా? శోభన్ మరో హిట్టు కొడతారా తెలియాలంటే మరో ఐదు రోజుల వరకు వేచి చూడాల్సిందే.


Full View
Tags:    
  • Santosh Sobhan 
  • Manchi Rojulochaie 
  • Trailer 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS