వావ్.. మహేష్‌ తో గ్రేట్ టెక్నీషియన్

Update: 2015-11-26 10:46 GMT
సంతోష్ శివన్.. ఈ పేరు చెప్పగానే రోజా - ఇద్దరు - దిల్ సే - కుచ్ కుచ్ హోతా హై - పుకార్ - అశోక లాంటి టాప్ క్లాస్ మూవీస్ గుర్తుకొస్తాయి. ఒకటి రెండు కాదు.. ఏకంగా ఐదు నేషనల్ అవార్డులు కొల్లగొట్టిన గ్రేట్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్. దర్శకుడిగా కూడా ప్రపంచ స్థాయి సినిమాలు తీసిన సంతోష్ కొంత కాలంగా బయటి దర్శకులకు పని చేయడం లేదు. చివరగా ఆయన చేసిన మెయిన్ స్ట్రీమ్ మూవీ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రావణ్’. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా సంతోష్ ఛాయాగ్రహణంపై ప్రశంసల జల్లు కురిసింది.

ఈ గ్రేట్ టెక్నీషియన్ మన మహేష్ బాబు సినిమాకు పని చేయబోతుండటం విశేషం. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందించబోతున్నాడు. మురుగదాస్ మీద ఉన్న గౌరవంతో ఈ సినిమాకు పని చేయడానికి ఒప్పుకున్నాడు శివన్. మురుగ తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సినిమాకు టాప్ క్లాస్ టెక్నీషియన్స్ ను సెట్ చేస్తున్నాడు. దాదాపు రూ.110 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్న సినిమా ఇది. తెలుగు - తమిళ - హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కించి ఒకేసారి విడుదల చేయబోతున్నారు. వచ్చే వేసవికి ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది.
Tags:    

Similar News