• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  27 ఏళ్ళ తర్వాత అతనితో...

27 ఏళ్ళ తర్వాత అతనితో రజని

By - Tupaki Desk
Update: 2018-12-03 10:41 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ 2.0 బాక్స్ ఆఫీస్ సంచలనం కొనసాగుతోంది. ఇంకో నెలన్నర లోపే మరో కొత్త సినిమా పెట్టా రానుండటంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన పెట్టాలో రజని మాఫియా డాన్ గా నటిస్తున్నట్టు టాక్ ఉంది. దీని తర్వాత ఏ సినిమా చేయబోతున్నాడు అనే కన్ఫర్మేషన్ అధికారికంగా లేదు కానీ చెన్నయ్ మీడియా మాత్రం మురుగదాస్ తో ప్రాజెక్ట్ లాక్ అయిపోయిందని పెట్టా విడుదల కాగానే షూటింగ్ ప్రారంభిస్తారని గట్టిగా వినిపిస్తోంది.

దీనికి సంబంధించిన టెక్నికల్ టీమ్ ని సెట్ చేసుకునే పనిలో దాస్ బిజీగా ఉన్నట్టు సమాచారం. సర్కార్ ఏ రేంజ్ లో మెప్పించింది అనేది పక్కన పెడితే కమర్షియల్ గా వర్క్ అవుట్ అయిన మాట వాస్తవం. స్పైడర్ గాయాలు తుడిచిపెట్టుకుపోయాయి. విజయ్ తో దిగ్విజయంగా హ్యాట్రిక్ పూర్తయిపోయింది. మరో అప్ డేట్ ఏంటంటే రజనితో చేయబోయే సినిమా కోసం సినిమాటో గ్రాఫర్ ని లాక్ చేసుకున్నాడట దాస్. అతను ఎవరో కాదు సంతోష్ శివన్. మహేష్ బాబు స్పైడర్ కి వర్క్ చేసింది ఈయనే.

కాకపోతే ఈ న్యూస్ లో ప్రత్యేకత ఏంటంటే సంతోష్ శివన్ రజనికాంత్ సినిమాకు వర్క్  చేసి పాతికేళ్ళు దాటేసింది. చివరిగా మణిరత్నం దళపతికి సంతోష్ శివన్ పని చేసాడు. అందులో మమ్ముట్టితో పాటు రజని హీరో. దాని తర్వాత ఇద్దరి కాంబో కుదరలేదు. ఇన్నాళ్లకు మురుగదాస్ ద్వారా అది నిజం కాబోతోంది. హీరోయిన్ గా కీర్తి సురేష్ లేదా కాజల్ అగర్వాల్ వైపు మురుగదాస్ మొగ్గు చూపుతున్నట్టు కూడా మరో టాక్ ఉంది. సో ఇంకో నెల రోజుల్లోనే తలైవా కొత్త సినిమాకు సంబంధించిన న్యూస్ వచ్చేస్తాయి
    

Tags:    
  • Santosh Sivan 
  • Rajinikanth 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS